Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..

,multibagger Stock

,multibagger Stock

భారత స్టాక్ మార్కెట్లో కొన్ని చిన్న తరహా కంపెనీల షేర్లు ఊహించని రీతిలో వృద్ధి చెందుతూ పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందిస్తుంటాయి. ప్రస్తుత తరుణంలో ‘బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్’ షేరు దలాల్ స్ట్రీట్‌లో మల్టీబ్యాగర్‌గా అవతరించి ఇన్వెస్టర్ల సంపదను స్వల్ప కాలంలోనే రెట్టింపు చేసింది. కేవలం గత మూడు నెలల కాలంలోనే ఈ స్టాక్ సుమారు 112 శాతం మేర వృద్ధి నమోదు చేయడం విశేషం.

ఈ అసాధారణ వృద్ధికి ప్రధానంగా కంపెనీకి దక్కిన భారీ కాంట్రాక్టులే కారణం. బ్లూస్ప్రింగ్ అనుబంధ సంస్థ అయిన స్టీగ్ ఎనర్జీ సర్వీసెస్, దిగ్గజ సంస్థ వేదాంత అల్యూమినియం నుంచి రూ.1,437 కోట్ల విలువైన ఐదేళ్ల పవర్ ప్లాంట్ నిర్వహణ ఆర్డర్‌ను కైవసం చేసుకుంది. దీనికి తోడు అంతకుముందే వేదాంత నుంచి రూ.1,219 కోట్లు మరియు రూ.406 కోట్ల విలువైన ఇతర మెయింటెనెన్స్ కాంట్రాక్టులను కూడా సొంతం చేసుకోవడంతో కంపెనీ భవిష్యత్తు ఆదాయాలపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది.

మరోవైపు ప్రముఖ దిగ్గజ ఇన్వెస్టర్ ఆశిష్ ధావన్ ఈ కంపెనీలో తన వాటాను 6.30 శాతానికి పెంచుకోవడం మార్కెట్లో సానుకూల సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుతం రూ.1.86 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఈ సంస్థ ప్రధానంగా ఫెసిలిటీ మేనేజ్మెంట్, టెలికాం, పవర్ సర్వీసెస్ రంగాలలో సేవలందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.124.50 వద్ద ట్రేడ్ అవుతున్న ఈ షేరు, భారీ ఆర్డర్ల అండతో రిటైల్ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.