పార్టీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యానీయే.. బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. కుదిరితే ఏదైనా హోటల్‌కు వెళ్లి ఇష్టమైన బిర్యానీ లాగించాలి.. లేదా ఆర్డర్ పెట్టి తినేయాలి.. అయితే, బిర్యానీ లాగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.. భారతీయులు ఈ ఏడాది బిర్యానీని భారీ స్థాయిలో ఆరగించేశారు. 2022 ఏడాదిలో కేవలం స్విగ్గీ ద్వారా నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.. గత ఏడాదితో పోలిస్తే.. ఇది ఎక్కువ.. ఎందుకంటే.. 2021లో ఈ సంఖ్య 115గా ఉంటే.. అది ఇప్పుడు 2.28 శాతం పెరిగి 137కు చేరింది.. బిర్యానీతో పాటు క్లాసిక్ మసాలా దోశను కూడా అధికంగా ఆర్డర్ చేసినట్లు తేలింది. స్నాక్స్ విభాగంలో సమోసాను ఎక్కువగా ఆర్డర్ చేశారని.. సమోసా కోసమే 40 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ వెల్లడించింది..
Read Also: Russian Soyuz Spacecraft : రష్యా అంతరిక్ష నౌకలో లీకేజీ.. వ్యోమోగామల స్పేస్ వాక్కు బ్రేక్
ఇక, రాత్రి 10 గంటల తర్వాత దాదాపు 20 లక్షల ఆర్డర్లకు పైగా పాప్ కార్న్ కోసం వచ్చినట్టు స్విగ్గీ పేర్కొంది.. స్వీట్ ప్రియులైతే.. గులాబ్ జామ్ కోసం 27 లక్షల ఆర్డర్లు, రస్‌మలై కోసం 16 లక్షలు, చాకో లావా కేక్ కోసం 10 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ వెల్లడించింది. మొత్తంగా.. 2022లో స్విగ్గీలో వరుసగా ఏడవ సంవత్సరం కూడా అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బిర్యానీ నిలిచింది.. భారతీయ ఆహారోత్పత్తుల రుచి ప్రొఫైల్‌లలో మార్పును కూడా పేర్కొంది స్విగ్గీ.. సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ స్పైసీ రామెన్ మరియు ఇటాలియన్ పాస్తా యొక్క ఆర్డర్‌లు కూడా గట్టిగానే ఉన్నాయని తెలిపింది.. మరోవైపు, స్విగ్గీ మెంబర్‌షిప్ ప్రోడక్ట్‌తో అత్యధికంగా ఆదా చేసిన సిటీగా బెంగళూరు నిలిచింది. బెంగుళూరులోని సభ్యులు అత్యధిక ప్రయోజనాలను పొందడం ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆదా చేశారు, ముంబై, హైదరాబాద్ మరియు ఢిల్లీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.. స్విగ్గీకి చెందిన 35 లక్షల మంది కస్టమర్లు ఈ ఏడాది రూ. 53 కోట్ల మేరకు టిప్.. డెలివరీ భాగస్వాములకు ఇచ్చారు.. ఏదేమైనా.. బిర్యానీ ఆరగించేవారి సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇది కేవలం స్విగ్గీ ద్వారా ఆర్డర్ ఇచ్చినవారి సంఖ్యే.. ఇతర ఫుడ్ డెలివరీ యాప్‌లు.. నేరుగా వివిధ హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లి బిర్యానీ ఆరగించేవారి సంఖ్య తీసుకుంటే మాత్రం.. ఇంకా భారీగా ఉంటుందన్నమాట..