Site icon NTV Telugu

Best Budget Projectors: తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులోకి వస్తున్న స్మార్ట్ ప్రెజెక్టర్లు

Untitled Design (3)

Untitled Design (3)

ప్రొజెక్టర్లు ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ బడ్జెట్‌లోనే మంచి నాణ్యత గల మోడళ్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు. వీటి సహాయంతో ఇంట్లోనే థియేటర్‌ లాంటి అనుభవాన్ని పొందడం చాలా సులభం. ప్రస్తుతం మార్కెట్లో అయిదువేల ధరలోనే స్మార్ట్‌ ప్రొజెక్టర్లు లభిస్తున్నాయి. ఇవి ఏ గోడనైనా టీవీ స్క్రీన్‌లా మార్చి, పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, సీరియల్స్, వీడియోలను ఆస్వాదించే అవకాశం ఇస్తాయి.

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ప్రొజెక్టర్‌ కావాలనుకునేవారికి Protronics Beam 440 ఒక మంచి ఎంపిక. ఇది 720p HD రిజల్యూషన్‌తో పాటు 3W ఇన్‌బిల్ట్ స్పీకర్‌తో వస్తుంది. దీని ధర సుమారు ₹4,740 మాత్రమే. మరో ప్రత్యామ్నాయంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో లభించే XElectron Techno ప్రొజెక్టర్‌ను ఎంచుకోవచ్చు. ఇది 4K రిజల్యూషన్ సపోర్ట్ అందించడమే కాకుండా మంచి బ్రైట్‌నెస్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ధర సుమారు ₹4,990.

అదే విధంగా, Lifelong ప్రొజెక్టర్ కూడా బడ్జెట్‌ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్. ఇది ఇన్‌బిల్ట్ స్పీకర్‌తో వస్తూ, అమెజాన్‌లో సుమారు ₹4,499 ధరకు లభిస్తోంది. మరో మంచి ఎంపికగా Wzatco Yuva Go ప్రొజెక్టర్‌ను కూడా పరిశీలించవచ్చు. దీని ధర ₹4,999, 4K కంటెంట్‌కు సపోర్ట్‌ ఇవ్వడంతో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందిస్తుంది.ఈ అన్ని మోడళ్లు తక్కువ బడ్జెట్‌లో హోమ్ థియేటర్ అనుభవాన్ని కోరుకునే వారికి అత్యుత్తమ ఎంపికలుగా చెప్పవచ్చు.

Exit mobile version