Site icon NTV Telugu

Bank Holidays: వచ్చే నెలలో 14 రోజులు బ్యాంకుల మూత..!

Bank

Bank

ఎంత డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నా.. ఏదో పనిమీద బ్యాంకుకు వెళ్లక తప్పదు.. ఇక, నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారి సంఖ్య కూడా భారీగా ఉంటుంది.. అయితే, వారంతా అలెర్ట్‌ కావాల్సిన సమయం వచ్చింది.. జూన్‌ నెల ముగించుకుని జులై నెలలో అడుగుపెట్టబోతున్న తరుణంలో.. జులైలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి.. జులైలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.. జూలై 9న బ‌క్రీద్ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా సెలవు కాగా.. ఇక, ఐదు ఆదివారాలు, రెండు శ‌నివారాలు బ్యాంకుల‌కు సెల‌వులు ఉంటాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇతర పూజా కార్యక్రమాలతో సెలువు ప్రకటించాయి ఆయా బ్యాంకులు..

Read Also: Viral: పిల్ల దొరకడం లేదట.. చివరకు ఏం చేశాడంటే..!

బ్యాంకులు ఏకంగా 14 రోజులు పని చేయవు కాబట్టి.. బ్యాంకు లావాదేవీలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఇక్కడ సెలవుల జాబితాను ఓసారి చూసుకోవడం మంచిది.. జులై 1న కాంగ్ సందర్భంగా భువ‌నేశ్వర్‌లో, 3న ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా, 7న దైవ పూజ‌ కారణంగా ఆగర్తలలో, 9న బక్రీద్ మరియు రెండో శనివారం కారణంగా దేశ్యాప్తంగా, 10న ఆదివారం, 11న ఈద్ఉల్ అజా, 13న భాను జ‌యంతి, 14న బెన్‌డ‌యంక్లామ్, 16న హ‌రెలా, 17న ఆదివారం, 23న నాలుగో శ‌నివారం, 24న ఆదివారం, 26న కెర్‌పూజ, 31న ఆదివారం సెలవులు ఉన్నాయి.. ఆయా ప‌ర్వదినాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఉండడంతో.. ఆయా రాష్ట్రాల్లో కొన్ని రోజులు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి.. బ్యాంకు లావాదేవీలు ఎక్కువగా.. నిత్యం జరిపేవారు ఈ తేదీలను గమనించగలరు.

Exit mobile version