NTV Telugu Site icon

బ్యాంకుల ప‌ని వేళ‌లు కుదించేశారు..!

Banking

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టిస్తున్న స‌మ‌యంలో.. నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకున్న ఆయా రాష్ట్రాలు.. లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నాయి.. మ‌రికొన్ని రాష్ట్రాలు.. క‌ర్ఫ్యూ, క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి.. దీంతో.. బ్యాంకింగ్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డుతోంది.. ఈ స‌మ‌యంలో.. దేశీయ బ్యాంకులు ప‌ని వేళ‌లు కుదించాయి.. ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ (ఐబీఏ) మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి బ్యాంకులు.. ఉద‌యం 10 గంట‌ల నుంచి మధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కే బ్యాంకింగ్ స‌మ‌యం ఉండాల‌ని ఐబీఏ సూచించిచ‌గా.. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగ బ్యాంకుల‌కు వ‌ర్తింప‌జేయ‌నున్నారు.. అయితే, వినియోగ‌దారుల‌కు క్యాష్ విత్ డ్రాయ‌ల్స్‌, డిపాజిట్లు, ప్ర‌భుత్వ బిజినెస్‌లు, చెల్లింపులు అనే నాలుగు త‌ప్ప‌నిస‌రి సేవ‌ల‌ను అందించాల‌ని ఐబీఏ పేర్కొంది.. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఖాతాదారుల‌కు అద‌న‌పు సేవ‌ల‌ను అందించే విష‌యంలో.. రాష్ట్ర స్థాయి లేదా కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయీ బ్యాంకింగ్ క‌మిటీలు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని సూచిచింది.

మ‌రోవైపు.. క‌రోనా స‌మ‌యంలో.. బ్యాంకింగ్ సిబ్బందిని కూడా త‌గ్గించాల‌ని సూచించింది.. రొటేష‌న‌ల్ ప్రాతిప‌తిక‌న విధుల‌కు హాజ‌రు కావాల‌ని పేర్కొన్న ఐబీఏ… వ‌ర్క్ ఫ్రం హోం అనుమ‌తించాల‌ని సూచిచింది.. 50 శాతం ఉద్యోగులు రొటేష‌న‌ల్ ప్రాతిప‌దిక‌న విధుల‌కు హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది.. కాగా, ఇప్ప‌టికే ప్ర‌భుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ.. త‌న శాఖ‌ల ప‌ని వేళ‌ల‌ను మార్చేసింది. త‌మ ఖాతాదారులు త‌ప్ప‌నిస‌రి అవ‌స‌ర‌మైతేనే బ్యాంకు శాఖ‌ల‌ను సంద‌ర్శించాల‌ని సూచిచింది.. ఈనెలాఖ‌రు వ‌ర‌కు ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు బ్యాంకింగ్ సేవ‌ల‌ను అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.