Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Strike Alert: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు సెప్టెంబర్ 11న అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు ప్రభుత్వ, ప్రైవేట్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు ఆ ఒక్క రోజు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయడంతో పాటు అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలన్నది వారి ప్రధాన డిమాండ్. 2024 మార్చిలో కుదిరిన 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య 5 డేస్ వర్కింగ్ వీక్‌పై అంగీకారం కుదిరినట్లు యూనియన్లు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వెలువడలేదని పేర్కొంటున్నాయి. వారంలో మిగిలిన రోజుల్లో రోజుకు అదనంగా 40 నిమిషాలు పనిచేసి శనివారం పనిని సర్దుబాటు చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించాయి.
సమ్మెలో పాల్గొనే సంఘాలు ఇవే
UFBUలో AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, INBOC తదితర ప్రధాన బ్యాంకింగ్ ఉద్యోగ, అధికారుల సంఘాలు ఉన్నాయి. 5 డేస్ వర్కింగ్ వీక్‌తో పాటు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా ఇవి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. సెప్టెంబర్ 11న చేపట్టనున్న సమ్మెను ఆందోళనల తొలి దశగా UFBU పేర్కొంది. డిమాండ్లపై సానుకూల నిర్ణయం రాకపోతే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల సమ్మెకు దిగుతామని ప్రకటించింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (PLI) చెల్లింపును తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ అంశం కూడా బ్యాంకు ఉద్యోగ సంఘాల ఆందోళనకు మరింత ఊతమిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐటీ, బహుళజాతి సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థల్లో ఇప్పటికే 5 డేస్ వర్కింగ్ విధానం అమల్లో ఉందని యూనియన్లు గుర్తుచేస్తున్నాయి. ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఒత్తిడి తగ్గింపు కోసం బ్యాంకింగ్ రంగంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
ఏ సేవలకు అంతరాయం అంటే..
సమ్మె ప్రభావంతో బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్, ట్రేడ్ ఫైనాన్స్, రుణాల పంపిణీ వంటి సేవలకు అంతరాయం కలగవచ్చని యూనియన్లు చెబుతున్నాయి. అయితే UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, ఏటీఎం సేవలు సాధారణంగానే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?