Bank Holidays: మే నెల రెండో వారం స్టార్ట్ అయ్యింది. ఈ వారంలో మీరు బ్యాంకుకు వెళ్లే పని ఉంటే.. మీరు ఇల్లు దాటే ముందే బ్యాంక్ సెలవుల జాబితాను ఒకసారి చూసుకోవడం ఉత్తమం. సరైన సమాచారం లేకుండా బ్యాంకుకు వెళ్తే, తీరా అక్కడికి వెళ్లాక గేట్లకు తాళాలు కనిపిస్తే మీ సమయం, శ్రమ రెండూ వృథా అవుతాయి. సామాన్యుల ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపే ఈ సెలవుల జాబితాను భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే విడుదల చేసింది.
రానున్న ఏడు రోజుల బ్యాంకింగ్ షెడ్యూల్ ఇదే..
మే 11 నుంచి మే 17 మధ్య బ్యాంకు పనుల కోసం ప్లాన్ చేస్తున్న వారికి ఒక శుభవార్త. ఈ వారం మొత్తం మీద కేవలం ఒక్క రోజు మాత్రమే బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. ఈ వారంలో జాతీయ స్థాయి లేదా ప్రాంతీయ పండుగలేవీ లేవు. ముఖ్యంగా మే 16 (శనివారం) నాడు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం నెలలో మొదటి, మూడవ, ఐదవ శనివారాల్లో బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. కాబట్టి మే 16న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల శాఖలు తెరిచే ఉంటాయి. కేవలం మే 17 (ఆదివారం) నాడు మాత్రమే సాధారణ వారాంతపు సెలవు కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి.
మే నెలలో మిగిలిన సెలవుల వివరాలు ఇవే..
ఈ వారం బ్యాంకులు ఓపెన్‌లో ఉన్నప్పటికీ, నెలాఖరు వరకు మరికొన్ని సెలవులు ఉన్నాయి. మే 23 నాల్గవ శనివారం.. ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. మే 24 ఆదివారం సాధారణ సెలవు, మే 27 బుధవారం బక్రీద్ (ఈద్-ఉల్-అదా) సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండే అవకాశం ఉంది. మే 31 ఆదివారం కావడంతో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పని మీద వెళ్లాలనుకుంటే, మే 16 (శనివారం) లోపే పూర్తి చేసుకోవడం ఉత్తమం.
