2023 ఏడాది ముగింపుకు చేరింది.. ఇక మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది.. కొత్త ఏడాది జనవరి 2024 లో కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో.. ఎప్పుడు ఉన్నాయో చూద్దాం..
కొత్త సంవత్సరం మొదటి నెలలోనే మీ బ్యాంకు పనికి ఇబ్బంది ఉండకుండా మీరు ముందుగానే సన్నాహాలు చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను చూస్తే దేశవ్యాప్తంగా ఏయే రోజులు, ఎక్కడెక్కడ బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం మంచిది..
2024 జనవరిలో బ్యాంకు సెలవులు..
* జనవరి 1- సోమవారం- నూతన సంవత్సరం- దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
* జనవరి 11- గురువారం- మిషనరీ డే- మిజోరం
*జనవరి 12- శుక్రవారం- స్వామి వివేకానంద జయంతి- బంగాల్
* జనవరి 13- రెండో శనివారం/లోహ్రి- దేశవ్యాప్తంగా సెలవు
*జనవరి 14- ఆదివారం- సంక్రాంతి- దేశవ్యాప్తంగా హాలిడే ఉంది.
* జనవరి 15- సోమవారం- పొంగల్, తిరువళ్లూర్ డే- తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో సెలవు
*జనవరి 16- మంగళవారం- తుసు పూజ- బంగాల్, అసోంలో సెలవు
*జనవరి 17- బుధవారం- గురు గోవింద్ సింగ్ జయంతి- పలు రాష్ట్రాల్లో సెలవు
* జనవరి 23- మంగళవారం- నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి- పలు రాష్ట్రాల్లో ఉంది.
* జనవరి 25- గురువారం- స్టేట్ డే- హిమాచల్ ప్రదేశ్
* జనవరి 26- శుక్రవారం- రిపబ్లిక్ డే- దేశవ్యాప్తంగా సెలవు
* జనవరి 27- నాలుగో శనివారం- దేశవ్యాప్తంగా సెలవు
* జనవరి 31- బుధవారం- మి-డామ్-మే-ఫి- అసోం..
ఈరోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందే చూసుకోవడం మంచిది..