క్రెడిట్ కార్డును ఒక్కొక్కరు ఒకలా వాడేస్తున్నారు.. క్రెడిట్ కార్డులపై షాపింగ్ చేసేవాళ్లు, ఆన్‌లైన్ పేమెంట్లు చేసేవాళ్లు.. అద్దెలు చెల్లించేవాళ్లు, ఆ చెల్లింపుల పేరుతో డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించి వాడుకునేవారు ఇలా ఎన్నో రకాలుగా వాడేస్తు్నారు.. అంతేకాదు.. అవసరాలను బట్టి క్రెడిట్ కార్డులపై లోన్లు కూడా తీసుకుంటున్నారు.. కొన్ని సార్లు పరిమితి మేరకు ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఆయా బ్యాంకులు కలిపిస్తాయి.. అయితే, ఇది, ఆ క్రెడిట్ కార్డు లిమిట్ కంటే చాలా తక్కువగా ఉంటుంది.. మరోవైపు.. క్రెడిట్ కార్డులపై చాలామంది పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటున్నారు.. ఈలోన్స్‌కు ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకపోవడంతో.. చాలా మందే ఆ లోన్స్‌కు మొగ్గుచూపుతున్నారు.. కానీ, క్రెడిట్ కార్డుపై లోన్స్ తీసుకునేవాళ్లు కొన్ని విషయాలను తెలుసుకుంటే మంచిది..
Read Also: Punjab Blast Mastermind: 2019 పంజాబ్ పేలుళ్ల సూత్రధారి అరెస్ట్
ప్రతీ క్రెడిట్ కార్డుకు ఓ నిర్ణీత లిమెట్ ఉంటుంది.. అంతేకాదు.. క్యాష్ విత్‌డ్రా కోసం మరో లిమిట్ ఉంటుంది.. క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకోవడం, లోన్ తీసుకోవడం రెండూ వేరు.. కార్డును ఉపయోగించి నగదు తీసుకున్నప్పుడు మీ కార్డు పరిమితి ఆ మేరకు తగ్గిపోతోంది.. దీనికోసం 36-48 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తాయి ఆయా బ్యాంకులు.. బిల్లింగ్ తేదీ నాడు మొత్తం బాకీని చెల్లించాల్సి ఉంటుంది.. ఇక, దీనికి భిన్నంగా కార్డుపై లోన్ తీసుకుంటే.. 36 నెలల వరకూ వ్యవధి ఉంటుంది… అంటే ఈఎంఐల రూపంలో ఇది చెల్లించే వెసులుబాటు ఉంటుంది.. దీనిపై వడ్డీ రేటు 16-18 శాతం వరకూ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. కార్డు లిమిట్‌తో ఈ లోన్‌కు సంబంధం ఉండదు.. కానీ, ఆ లోన్‌కు ముందు.. సంబంధిత వ్యక్తి క్రిడిట్ కార్డు కోసం సమర్పించే డాక్యుమెంట్ల ఆధారంగా ఈ లోన్ ఇస్తారు.. కాబట్టి, ప్రత్యేకంగా మళ్లీ లోన్‌కోసం అదనపు పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు.
మీ క్రెడిట్ కార్డుపై లోన్ పొందే అవకాశం ఉందా? ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? అనేది ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు… ఇక, పొందిన లోన్‌ను ఈఎంఐ రూపంలో చెల్లించాలి.. 6 నుంచి 36 నెలల వరకు పరిమితి ఇస్తారు.. ప్రతీనెలా.. క్రెడిట్ కార్డు బిల్లుతో పాటు.. ఈఎంఐను కూడా చెల్లించాల్సి ఉంటుంది.. ఎక్కువ బ్యాంకులు 6 నుంచి 36 నెలల వరకే అవకాశం ఇస్తుండగా.. కొన్ని కార్డు సంస్థలు దాదాపు ఐదేళ్ల వరకు అనుమతి ఇస్తాయి.. అయితే, ఇతర లోన్లతో పోలిస్తే క్రెడిట్ కార్డుపై తీసుకునే లోన్లకు ఎక్కువ వడ్డీ ఉంటుంది.. కావు, ఇతర మార్గాల్లో లోన్ బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు.. అత్యవసరం అయితే తప్ప.. క్రెడిట్ కార్డులపై లోన్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.. ఎందుకంటే.. ఈఎంఐలు చెల్లించడం ఆలస్యం అయితే, వడ్డీలు, ఫైన్ల రూపంలో అది తడిసి మోపెడు అవుతుంది.. అంతేకాదు.. ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రతీకూల ప్రభావాన్ని కూడా చూపిస్తుంది.