Amazon Layoff: అమెజాన్ వెబ్ సర్వీస్ నుంచి వందలాది మంది ఉద్యోగుల తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Layoff: ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం టెక్ సంస్థల్ని కలవరపెడుతున్నాయి. గత రెండేళ్లుగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇప్పటికీ పలు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఆదాయం తగ్గడంతో ఖర్చలని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాయి.
Read Also: Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) వందలాది మంది ఉద్యోగులను తొలగించినట్లు బుధవారం తెలిపింది. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, టెక్ రోల్స్‌లోని ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. ప్రభావిత సిబ్బందిలో AWS సేల్స్, మార్కెటింగ్ మరియు గ్లోబల్ సర్వీసెస్ డివిజన్ మరియు ఫిజికల్ స్టోర్స్ టెక్నాలజీ టీమ్‌లో వందలాది ఉద్యోగులు ఉన్నారని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం తెలిపింది. సంస్థలోని కొన్ని విభాగాలను క్రమబద్ధీకరించాలని అనుకుంటున్నట్లు AWS ప్రతినిధి మెయిల్‌లో తెలిపారు.
గత రెండేళ్లుగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాల కోతలు పెడుతున్నాయి. ఈ ఏడాది కూడా అది కొనసాగుతోంది. అమెజాన్ ఇప్పటికే ప్రైమ్ వీడియో సర్వీస్, హెల్త్ కేర్ బిజినెస్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యూనిట్‌తో సహా పలు విభాగాల్లో వందలాది మంది సిబ్బందిని తొలగించింది. లేఆఫ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు 229 సంస్థలలో 57,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకున్న కంపెనీలు క్రమంగా తమ వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుంటున్నాయి. అమెజాన్ 2022, 2023లో 27,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది.
తాజావార్తలు
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
-
Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
-
Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!