NTV Telugu Site icon

Amazon Layoff: అమెజాన్ వెబ్ సర్వీస్ నుంచి వందలాది మంది ఉద్యోగుల తొలగింపు..

Aws

Aws

Amazon Layoff: ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం టెక్ సంస్థల్ని కలవరపెడుతున్నాయి. గత రెండేళ్లుగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇప్పటికీ పలు కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఆదాయం తగ్గడంతో ఖర్చలని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాయి.

Read Also: Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) వందలాది మంది ఉద్యోగులను తొలగించినట్లు బుధవారం తెలిపింది. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్, టెక్ రోల్స్‌లోని ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. ప్రభావిత సిబ్బందిలో AWS సేల్స్, మార్కెటింగ్ మరియు గ్లోబల్ సర్వీసెస్ డివిజన్ మరియు ఫిజికల్ స్టోర్స్ టెక్నాలజీ టీమ్‌లో వందలాది ఉద్యోగులు ఉన్నారని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం తెలిపింది. సంస్థలోని కొన్ని విభాగాలను క్రమబద్ధీకరించాలని అనుకుంటున్నట్లు AWS ప్రతినిధి మెయిల్‌లో తెలిపారు.

గత రెండేళ్లుగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాల కోతలు పెడుతున్నాయి. ఈ ఏడాది కూడా అది కొనసాగుతోంది. అమెజాన్ ఇప్పటికే ప్రైమ్ వీడియో సర్వీస్, హెల్త్ కేర్ బిజినెస్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యూనిట్‌తో సహా పలు విభాగాల్లో వందలాది మంది సిబ్బందిని తొలగించింది. లేఆఫ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు 229 సంస్థలలో 57,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకున్న కంపెనీలు క్రమంగా తమ వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుంటున్నాయి. అమెజాన్ 2022, 2023లో 27,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది.