Site icon NTV Telugu

Amazon: బంప‌ర్ ఆఫ‌ర్‌… వారికి మాత్ర‌మే…

అమెజాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అమెజాన్ ప్రైమ్ సేవ‌ల ధ‌ర‌ల‌ను 50 శాతానికి త‌గ్గించింది. గ‌తేడాది ప్రైమ్ సేవ‌ల ధ‌ర‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఏడాది త‌గ్గించిన ఈ త‌గ్గింపు అంద‌రికీ కాద‌ని అమెజాన్ పేర్కొన్న‌ది. యూవ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు రెఫ‌ర‌ల్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చింది. రిఫ‌ర్ చేసిన యూజ‌ర్ ప్రైమ్‌లో చేరితే, స‌భ్య‌త్వంపై 50 శాతం త‌గ్గింపు వ‌స్తుంది.

Read: Pakistan: పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

యూత్ ఆఫ‌ర్ లో భాగంగా ప్రైమ్ మెంబ‌ర్ షిప్ తీసుకంటే నెల‌వారీ స‌భ్య‌త్వం రూ. 179పై రూ. 90 క్యాష్ బ్యాక్‌తో పాటు మ‌రో రూ. 18 క్యాష్‌బ్యాక్‌ను రిఫ‌ర‌ల్ రివార్డుగా యూజ‌ర్‌కు అందిస్తుంది. నెల‌వారీగా కాకుండా మూడు నెల‌ల స‌భ్య‌త్వం రూ. 439 తో తీసుకుంటే, రూ. 230 క్యాష్‌బ్యాక్, రిఫ‌ర‌ల్ రివార్డు కింద రూ. 46 పొంద‌వ‌చ్చు. సంవ‌త్స‌రంపాటు స‌భ్య‌త్వం రూ. 1499 తో తీసుకుంటే రూ. 750 క్యాష్‌బ్యాక్‌, రిఫ‌ర‌ల్ రివార్డు కింద రూ. 150 క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.

Exit mobile version