Site icon NTV Telugu

Amazon Prime : ప్రైమ్ యూజర్స్ కి గుడ్ న్యూస్..ఆ ప్లాన్ పై భారీ తగ్గింపు..

Prime Video

Prime Video

అమెజాన్ ప్రైమ్ తమ యూజర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ ధరలను ప్రకటించింది. రూ.999గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ మెంబర్షిప్ ను ప్రకటించింది.. ఇక గతంలో ఈ మెంబర్ షిప్ నెలకు రూ.299, 3నెలలకు రూ.599, ఇయర్ ప్లాన్ రూ.1,499గా ఉండేది. ఆ తర్వాత ప్రైమ్ లైట్ ను జూన్ లో ప్రారంభించిన అమెజానల్ ప్రైమ్ ప్లాన్ లో కొన్ని మార్పులను చేస్తున్నట్లు ప్రకటించింది..

మామూలు ప్రైమ్ మెంబర్ షిప్ తో పోలిస్తే.. ఇందులో కాస్త ప్రయోజనాలు తక్కువగానే ఉన్నాయి. ఈ ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ మెంబర్ షిప్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.. అయితే మిగిలిన వాటికి ఎటువంటి తగ్గింపు లేదని చెప్పారు.. సాదారణంగా ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్లు అనేక ప్రయోజనాలను పొందుతూన్నారు.. ధరతోపాటు ప్లాన్ లో కనిపించే మార్పుల విషయానికొస్తే… ఈ ప్లాన్ లో ఇంతకుముందు రెండు రోజుల్లో డెలివరీ చేసేవాళ్ళు.. కానీ ఇప్పుడు మాత్రం వన్ డే లో డెలివరీ అవుతుంది.. అలాగే టు డే డెలివరీ ఉంటుందని చెబుతున్నారు.. కొన్ని వస్తువులకు ఇంకాస్త ఫాస్ట్ గా డెలివరీ ఉంటుందని చెబుతున్నారు..

ఇకపోతే ప్రైమ్ వీడియో క్వాలిటీని హెచ్ డీ కి పరిమితం చేయగా.. తాజా ధర తగ్గింపు వల్ల ఈ మెంబర్ షిప్ కేవలం ఒక యూజర్ కి మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతి వస్తువుపై రూ.175తో మార్నింగ్ డెలివరీ, నో-కాస్ట్ ఈఎంఐ, 6నెలల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ వంటివి చాలానే ఉన్నాయి… అంతేకాదు అన్ లిమిటెడ్ ప్రైమ్ వీడియో డివైజ్ సపోర్ట్ తో పాటు, 4కె రిజల్యూషన్ సపోర్ట్ ను కూడా కోల్పోనున్నట్లు ప్రైమ్ ప్రకటించింది..

Exit mobile version