NTV Telugu Site icon

AIRTEL: సీమీవీ6లో ఎయిర్‌టెల్ భారీ పెట్టుబ‌డులు…

ప్ర‌ముఖ మొబైల్ దిగ్గ‌జం ఎయిర్‌టెల్ వివిధ రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ది. తాజాగా ఇంట‌ర్నెట్ క‌న్సార్టియం సీమీవీ6లో చేరింది. వేగంగా అభివృద్ది చెందుతున్న డిజిట‌ల్ ఎకాన‌మీకి కావాల్సిన నెట్‌వ‌ర్క్ అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ఈ సీమీవీ6 ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక ఈ సీమీవీ6 2025 నుంచి అందుబాటులోకి రానున్న‌ది. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నిధుల్లో 20 శాతం నిధుల‌ను ఎయిర్‌టెల్ సంస్థ స‌మ‌కూర్చుతున్న‌ది.

Read: Live: గౌతమ్ రెడ్డికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

ఈ ప్రాజెక్టులో ఎయిర్‌టెల్‌తో పాటు బంగ్లాదేశ్ కేబుల్ స‌బ్‌మెరైన్ కంపెనీ, మాల్దీవుల‌కు చెందిన ధిరాగు, సౌదీ అరెబీయాకు చెందిన జిబౌటీ టెలికాం, మొబిలీ, ఫ్రాన్స్ కు చెందిన ఆరెంజ్‌, సింగ‌పూర్‌కు చెందిన సింగ్‌టెల్‌, శ్రీలంక టెలికాం, టెలికాం ఈజిప్ట్‌, టెలికాం మ‌లేషియా, ఇండోనేషియాకు చెందిన టెలిన్ వంటివి స‌భ్య‌దేశాలుగా ఉన్నాయి. మొత్తం 10,200 కిమీ పొడ‌వైన కేబుల్‌ను స‌ముద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేబుల్ అందుబాటులోకి వ‌స్తే హైస్పీడ్ ఇంట‌ర్నెట్ ఫెసిలిటీ అందుబాటులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.