Disney Plus Hotstar: వారికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ..బంపరాఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం బంపరాఫర్ ప్రకటించింది. ఇటీవల కొన్ని ప్లాన్‍లకు డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్‍ను ఎయిర్‌టెల్ యాడ్ చేస్తోంది. ప్రీపెయిడ్ ప్లాన్‍లతో ఈ ఓటీటీ బెనిఫిట్‍ను ఉచితంగా ఇస్తోంది. ఇదే క్రమంలో మరో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‍లతో డిస్నీ+ హాట్‍స్టార్ బెనిఫిట్‍ను అందించేందుకు ఎయిర్‌టెల్ సిద్ధమైంది. దీంతో ఈ మూడు ప్లాన్‍లను తీసుకునే యూజర్లు ఇక నుంచి హాట్‍స్టార్ సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చు. రూ.719, రూ.779, రూ.999 ప్లాన్‍లకు డిస్నీ+ హాట్‍స్టార్ బెనిఫిట్‍ను ఎయిర్‌టెల్ తాజాగా యాడ్ చేసింది. ఇక నుంచి ఈ ప్లాన్‍లను రీచార్జ్ చేసుకుంటే డిస్నీ+ హాట్‍స్టార్ మూడు నెలల సబ్‍స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీటితో పాటు సాధారణంగా ఈ ప్లాన్‍లకు ఉండే బెనిఫిట్స్ కూడా వస్తాయి. అయితే.. ప్రస్తుతం ఎయిర్‌టెల్ యాప్, ఎయిర్‌టెల్ వెబ్‍సైట్ నుంచి రీచార్జ్ చేసుకుంటేనే ఈ మూడు ప్లాన్‍లకు ఈ అదనపు డిస్నీ+ హాట్‍స్టార్ బెనిఫిట్ లభిస్తోంది.
Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ సెకండ్ పార్ట్ ఉందా? అందుకే అలా ముగిసిందా?
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
రూ.719 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతీ రోజు 1.5 జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు ఉచితంగా లభిస్తాయి. ఉచిత హలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్‍లో ఓటీటీల యాక్సెస్, వింక్ మ్యూజిక్ లాంటి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి. తాజాగా మూడు నెలల డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్ కూడా వస్తోంది. ఇక రూ.779 ప్లాన్‌తో రీచార్జ్ చేస్తే.. 90 రోజుల వ్యాలిడిటీతో ప్రతీ రోజు 1.5జీబీ డేటా దక్కుతుంది. అన్‍లిమిడెట్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. కొత్త మార్పుతో 3 నెలల పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీని ఉచితంగా వాడుకోవచ్చు. రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‍కు కూడా తాజాగా డిస్నీ+ హాట్‍స్టార్ 3 నెలల ఉచిత సబ్‍స్క్రిప్షన్ జత అయింది. ఈ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే ప్రతీ రోజు 2.5 జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి. వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‍తో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్ ట్రీమ్‍లో ఓటీటీలు, వింక్ మ్యూజిక్, ఉచిత హలోట్యూన్స్‌తో పాటు మిగిలిన ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ వాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్‌ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!