Aadhar Update Charges: ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో ప్రతి భారతీయుడికి ‘ఆధార్’ అనేది ఒక అనివార్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి. అయితే, ఆధార్‌లోని వివరాలు ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వివిధ రకాల అప్‌డేట్ సేవలను అందిస్తోంది. ఈ సేవలకు సంబంధించి వసూలు చేసే రుసుముల వివరాలను ప్రజల అవగాహన కోసం స్పష్టంగా ప్రకటించింది.
1. ఆధార్ నమోదు (Enrolment)
కొత్తగా ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం పూర్తిగా ఉచితం. దీని కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
2. బయోమెట్రిక్ అప్‌డేట్ (Biometric Update)
వేలిముద్రలు (Fingerprint), కనుపాప (Iris) , ఫోటో వంటి వివరాలను మార్చుకోవడానికి ఈ సేవ ఉపయోగపడుతుంది. దీనిలో సాధారణ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు రూ.125 చెల్లించాలి. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు చేసే ‘తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్’ పూర్తిగా ఉచితం. ఈ సౌకర్యం సెప్టెంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.
Before availing Aadhaar services, please check the applicable charges to avoid paying any extra amount to the operator.#Aadhaar #UIDAI #AadhaarServices #DigitalIdentity #DigitalIndia pic.twitter.com/Z76irFx4IR
— Aadhaar (@UIDAI) April 30, 2026
3. డెమోగ్రాఫిక్ అప్‌డేట్ (Demographic Update)
పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి వంటి వివరాలను సవరించుకోవడానికి..రూ.75 రుసుము చెల్లించాలి.
4. డాక్యుమెంట్ అప్‌డేట్ (Document Update)
గుర్తింపు , చిరునామా ధృవీకరణ పత్రాలను సమర్పించి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటే.. మీరు నేరుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి డాక్యుమెంట్ అప్‌డేట్ చేయించుకుంటే రూ.75 చెల్లించాలి.
‘myAadhaar’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వయంగా చేసుకుంటే జూన్ 14, 2026 వరకు ఈ సేవ ఉచితంగా పొందవచ్చు. పైన పేర్కొన్న రుసుములన్నీ వర్తించే పన్నులతో (Taxes) కలిపి ఉంటాయి. అదనపు మొత్తాన్ని ఎవరైనా డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయవచ్చు. మీ ఆధార్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ గా ఉంచుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చు.
తాజావార్తలు
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్‌డేట్
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!