Life Insurance Mistakes: లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Life Insurance Mistakes: జీవిత బీమా అంటే చాలామందికి ఒక భరోసా. మనం లేని తర్వాత కుటుంబానికి ఆర్థిక రక్షణగా నిలిచే అండ. కానీ అదే బీమా పాలసీ చివరి సమయంలో తిరస్కరణకు గురైతే…? ఏళ్ల తరబడి ప్రీమియంలు చెల్లించిన తర్వాత కుటుంబానికి ఆ సొమ్ము చెందకుండా పోయే పరిస్థితి వస్తే…? ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్లెయిం వివాదాలు ఈ ప్రశ్నలనే ప్రజల ముందుకు తెస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి ఎం నగరాజు చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై మరింత చర్చకు దారి తీశాయి. పాలసీలు అమ్మేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు తగిన ప్రశ్నలు అడగడం లేదని, కానీ క్లైమ్ సమయంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
జీవిత బీమా రంగంలో అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. పాలసీ తీసుకునే సమయంలో చాలామంది ఆరోగ్య వివరాలు, లైఫ్ స్టైల్ అలవాట్లు, ఆదాయ సమాచారం విషయంలో సరైన వివరాలు ఇవ్వడం లేదు. కానీ బీమా కంపెనీలు ప్రీమియంలను నిర్ణయించేది ఈ సమాచారంపైనే ఆధారపడి ఉంటుంది. సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిలేష్ పరమార్ చెప్పినట్లుగా, ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితి గురించి సరైన సమాచారం ఉంటేనే కంపెనీలు ప్రమాదాన్ని అంచనా వేయగలవు. డయాబెటిస్, బీపీ, గుండె సమస్యలు వంటి వ్యాధులను దాచిపెట్టడం, ధూమపానం, మద్యం అలవాట్లను చెప్పకపోవడం తర్వాత క్లైమ్ తిరస్కరణకు కారణమవుతుంది. ముఖ్యంగా పాలసీ తీసుకున్న కొద్ది కాలంలోనే మరణం జరిగితే కంపెనీలు ప్రత్యేక విచారణ చేపడతాయి. అప్పుడు నిజాలు బయటపడితే కుటుంబం క్లైమ్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
Also Read
- ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
- India’s Most Powerful Women 2026: దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరు?.. ఏకంగా రూ.39 లక్షల కోట్ల ఆస్తులు!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్‌తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
ఇంకో పెద్ద సమస్య ఆదాయ వివరాల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం. ఎక్కువ మొత్తంలో బీమా పొందేందుకు కొందరు తమ అసలు ఆదాయాన్ని మించి చూపిస్తుంటారు. కానీ ఇది తర్వాత క్లైమ్ సమయంలో ఇబ్బందులకు దారి తీస్తుందని ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ వెంకటేష్ నాయుడు చెబుతున్నారు. అధిక మొత్తంలో అష్యూర్డ్ తీసుకునే సమయంలో కంపెనీలు ఐటీఆర్, శాలరీ స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లను అడగవచ్చు. అప్పటికి సమాచారం సరిపోకపోతే క్లైమ్ మొత్తాన్ని తగ్గించడం లేదా తిరస్కరించడం కూడా జరుగుతుంది. జీవిత బీమా లాభాల కోసం కాదు, నష్టాన్ని భర్తీ చేయడానికి అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిందే.
నామినీ విషయంలో జరిగే నిర్లక్ష్యం కూడా కుటుంబాలను కోర్టుల చుట్టూ తిప్పిస్తోంది. పాలసీ తీసుకునే సమయంలో నామినీ పేరు ఖాళీగా వదిలేయడం, మైనర్ పిల్లల పేర్లు పెట్టి గార్డియన్ వివరాలు ఇవ్వకపోవడం, పెళ్లి లేదా కుటుంబ మార్పుల తర్వాత నామినేషన్ అప్డేట్ చేయకపోవడం వంటి తప్పులు తర్వాత పెద్ద సమస్యగా మారుతున్నాయి. కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనం చంద్వానీ మాట్లాడుతూ.. తప్పుగా ఉన్న నామినేషన్ కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు సక్సెషన్ సర్టిఫికెట్లు, లీగల్ హెయిర్ డాక్యుమెంట్లు కోరాల్సి వస్తోంది. దీంతో క్లైమ్ ప్రక్రియ నెలల తరబడి ఆలస్యం అవుతోంది. అంతేకాదు, ఇప్పటికే ఉన్న ఇతర బీమా పాలసీల వివరాలను దాచిపెట్టడం కూడా సమస్యలకు దారి తీస్తోంది. ఒక వ్యక్తి మొత్తం బీమా పరిమితి అతని ఆదాయానికి సరిపోతుందా లేదా తెలుసుకోవడానికే కంపెనీలు ఇతర పాలసీల వివరాలు అడుగుతాయి. పాత పాలసీలలో ఆరోగ్య సమస్యల కారణంగా అధిక ప్రీమియం విధించారా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తాయి.
చాలా సందర్భాల్లో ఏజెంట్లు ఫారమ్‌లు నింపేస్తుంటారు. కానీ చివరి బాధ్యత మాత్రం పాలసీదారిదే. అందుకే ఫారమ్‌లో ఉన్న ప్రతి వివరాన్ని స్వయంగా పరిశీలించడం అత్యంత కీలకం. అలాగే కంపెనీలు చేసే వెరిఫికేషన్ కాల్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆ కాల్ ఉద్దేశం కస్టమర్‌కు పాలసీ వివరాలు పూర్తిగా అర్థమయ్యాయా లేదా తెలుసుకోవడమే. ఆరోగ్య పరిస్థితి, ప్లాన్ ఫీచర్లు, వ్యక్తిగత సమాచారం అన్నింటినీ ఆ కాల్ ద్వారా ధృవీకరిస్తారు. ఆ సమయంలో ఇతరుల సూచనలతో కాకుండా నిజాయితీగా సమాధానాలు ఇవ్వాలి. అలా అయితేనే మీ పాలసికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే ఆ పాలసీ మీ చేతికి వచ్చిన తర్వాత కూడా మీ బాధ్యత ముగియదు. ఫ్రీ లుక్ పీరియడ్ అనే అవకాశం చాలా మందికి తెలియదు. ఆఫ్‌లైన్ పాలసీలకు 15 రోజులు, ఆన్లైన్ పాలసీలకు 30 రోజుల సమయం ఉంటుంది. ఈ సమయంలో పాలసీ నిబంధనలు సరిచూసుకుని, అవసరమైతే తప్పులు సవరించుకోవచ్చు లేదా పాలసీని రద్దు చేసుకోవచ్చు. మెడికల్ టెస్ట్ వంటి కొన్ని ఖర్చులు మినహాయించి మిగిలిన ప్రీమియం తిరిగి వస్తుంది. అంటే జీవిత బీమా కేవలం ఒక ఫార్మాలిటీ కాదు. అది భవిష్యత్తులో కుటుంబానికి నిలిచే ఆర్థిక రక్షణ. కాబట్టి చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సామాన్యుడికి ఒక భరోసా. దీని గురించి తెలియకపోతే తెలుసుకోవడం చాలా అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఇచ్చే భరోసా మరెవ్వరూ ఇవ్వలేరు. అయితే దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం కూడా అవసరం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడే ఒక సాధనం.
తాజావార్తలు
-
JIO New Offer: నెల ఉచిత వైఫై, 100Mbps ఇంటర్నెట్, 12 OTT యాప్‌లు, 1,000 టీవీ ఛానెల్స్..
-
El Nino Alert: ఐఎండీ అలర్ట్.. ఆగస్టులో తక్కువ వర్షాలుంటాయని హెచ్చరిక
-
Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి – నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
-
Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
-
HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!