NTV Telugu Site icon

బిగ్‌బాస్-5: పోటీలో ఆరుగురు… ఈ వారం కెప్టెన్ ఎవరు?

బిగ్‌బాస్ హౌస్‌లో 8వ వారం కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ బరిలో ఉండేందుకు బిగ్‌బాస్ ఐదుగురికి మాత్రమే అవకాశం ఇచ్చాడు. దీని కోసం ఐదు టాస్కులను కంటెస్టెంట్ల ముందు ఉంచాడు. మట్టిలో ముత్యాలు అనే మొదటి టాస్కులో లోబో, షణ్ముఖ్ పోటీ పడగా షణ్ముఖ్ గెలిచాడు. రెండోది ఫోకస్ టాస్క్. ఈ టాస్కులో రవి, సిరి పోటీ పడగా సిరి గెలిచింది. మూడోది ఫిజికల్ టాస్క్. ఈ టాస్కులో శ్రీరామ్, మానస్ పోటీ పడగా శ్రీరామ్ విజయం సాధించాడు. ఈ మూడు టాస్కులు మంగళవారం ముగిశాయి.

Read Also: బిగ్ బాస్ 5 : ప్రియాకు షాకింగ్ రెమ్యూనరేషన్?

ఇక నాలుగో టాస్క్ బుధవారం జరగనుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ‘రంగు పడుద్ది’ అనే టాస్కును బిగ్‌బాస్ ఇచ్చినట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఇందులో యానీ మాస్టర్, ప్రియాంక పోటీ పడగా యానీ మాస్టర్ గెలిచినట్లు సమాచారం. ఐదో ఛాలెంజ్‌లో భాగంగా ఎవరు పాల్గొనాలనే విషయంపై హౌస్‌లో చర్చోపచర్చలు జరిగాయి. జెస్సీ మరోసారి కెప్టెన్ అవ్వాలని ప్రయత్నించగా… హౌస్‌లో ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంతో అతడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఐదో ఛాలెంజ్‌లో మానస్ విజయం సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సన్నీకి బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ ప్రకారం అతడు కూడా కెప్టెన్సీ టాస్కులో పోటీ పడుతున్నాడు. దీంతో ఈ వారం కెప్టెన్ పదవి కోసం ఆరుగురు పోటీ పడుతున్నారు. షణ్ముఖ్, శ్రీరామ్, సిరి, యానీ, మానస్, సన్నీలలో కెప్టెన్ ఎవరు అవుతారో బుధవారం ఎపిసోడ్‌లో తేలనుంది.