NTV Telugu Site icon

Singer Damini : రతికా- రాహుల్ సిప్లిగంజ్ లవ్ స్టోరి గురించి నిజాలు బయటపెట్టిన దామిని.. అదంతా అబద్దామా?

Damini

Damini

బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో గురించి అందరికీ తెలుసు.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. గతంలో లాగా ఎఫైర్ లు, వల్గరిటీ లేకుండా ఉండటంతో ఈ సీజన్ పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది.. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన వారంతా ఇంటర్వ్యూ లు ఇస్తూ హౌస్ లో జరిగే వాటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.. తాజాగా సింగర్ దామిని ఇంటర్వ్యూ లో రతిక, రాహుల్ సిప్లిగంజ్ ప్రేమ వ్యవహారం గురించి సంచలన విషయాలను బయట పెట్టింది..

డబుల్ మైండ్ తో రతిక హౌస్ లోకి వచ్చింది..పీఆర్ టీమ్ ని సిద్ధం చేసుకుని హౌస్లోకి వెళ్లిన రతిక మొదటి రోజును నుండి ఎలా ఆడాలో ముందుగానే ప్లాన్ వేసుకుంది. హౌస్లో ఎఫైర్ పెట్టుకోవాలి అనేది కూడా ఆమె ప్రణాళికలలో భాగం. అందుకే మొదట పల్లవి ప్రశాంత్ ని గెలికింది.. ట్రాప్ లో పడ్డాక వాడుకుంది.. ఇక రాహుల్ తో బ్రేకప్ అయ్యినట్లు కలరింగ్ ఇచ్చింది.. తనకు ఫేవర్ గా వాడుకోవాలని, సింపతీ రాబట్టాలని ప్లాన్ చేసింది. తనకు ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. అతడు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాడు. అతన్ని చాలా మిస్ అవుతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది. బిగ్ బాస్ కి పేరు చెప్పకున్నా, హౌస్ మేట్స్ తో తన మాజీ లవర్ రాహుల్ గురించి రతిక మళ్లాడేదట…

టీఆర్పీ కోసం పీఆర్ టీమ్ రాహుల్ తో ఉన్న ఫోటోలను రివిల్ చేశారు.. దీనిపై రాహుల్ సిప్లిగంజ్ మండిపడ్డాడు. రతిక గేమ్ ని నమ్ముకోకుండా ఇతరుల ఫేమ్ వాడుకుని గెలవాలి అనుకుంటుందని సోషల్ మీడియాలో పరోక్ష పోస్ట్లు పెట్టాడు. ఇది కూడా రతికకు మైనస్ అయ్యింది.. అలా ఆమె ఎలిమినేట్ అయ్యిందని చెప్పింది.. దామిని మూడో వారం ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఆమె బయటకు వెళ్ళగానే రాహుల్ సిప్లిగంజ్ ఫోన్ చేశాడట. తనను కలిశాడట. రాహుల్ వ్యక్తిగత విషయాలు ఎవరితో పంచుకోడు. కాకపోతే రతిక హౌస్లో చేసిన పనికి నాతో అన్ని విషయాలు మాట్లాడాడు అని దామిని అన్నారు.. ఇప్పుడు మళ్లీ తాను ప్లాన్ తోనే ఉంటుందని ఆమె అన్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Show comments