NTV Telugu Site icon

Pallavi Prashanth: శంకరన్న ఇంట్లో పల్లవి ప్రశాంత్.. అన్నా నీ ప్లానేంటి?

Pallavi Prasanth (2)

Pallavi Prasanth (2)

బిగ్ బాస్ సీజన్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరి మనుషులను దోచుకున్నాడు.. దాంతో విన్నర్ గా నిలిచాడు.. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఫ్యాన్స్ చేసిన పనికి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.. బిగ్ బాస్ క్రేజ్ వల్ల అతని జాతకం మారిపోతుందని అనుకున్నారు.. కానీ రైతు బిడ్డ ఇప్పటికి రైతు బిడ్డగానే ఉంటున్నాడు..

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పల్లవి ప్రశాంత్ లేటెస్ట్ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.. తాజాగా అంబర్ పేట్ శంకరన్న ఇంట్లో కనిపించడం.. ఆయనతో పలు విషయాలపై చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. పాలిటిక్స్ లో రాబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది.. దాంతో ఆ ఫోటోలు ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి..

బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ తనక్రేజ్ కు తగ్గట్టుగా పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల రైతులకు చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు.. కొందరు రైతులను కలిసి ఆర్థిక సాయాన్ని అందించాడు.. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలా శంకరన్న తో దిగిన ఫోటోలు నెట్టింట చర్చనీయాంసంగా మారాయి.. పల్లవి ప్రశాంత్ నెక్స్ట్ ప్లానేంటి అంటూ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.. మరి దీనిపై క్లారిటీ రావాలంటే పల్లవి ప్రశాంత్ నోరు విప్పేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..