NTV Telugu Site icon

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ప్రియులకు గుడ్ న్యూస్..

Biggbosstelugu

Biggbosstelugu

బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఏకైక షో బిగ్ బాస్.. ఈ షో మొదట్లో విమర్శలు అందుకున్న చివరికి భారీ సక్సెస్ ను అందుకుంది.. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.. ఇప్పుడు 8 వ సీజన్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఏడో సీజన్ ప్రేక్షకులను బాగా అలరించింది.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది.. ఇక బిగ్ బాస్ సీజన్ 8 అనుకున్న దానికంటే ముందే ప్రారంభం కానుందని సమాచారం. బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 8 కోసం సన్నాహాలు మొదలు పెట్టారని వార్త చక్కర్లు కొడుతుంది.

అంతేకాదు సీజన్ 8 కోసం కంటెస్టెంట్స్ కోసం వెతుకులాట మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.. గత సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో 8 వ సీజన్ ను మొదలు పెట్టనున్నారు.. బాస్ సీజన్ 7 సంచలన విజయం సాధించింది. అత్యధికంగా 21. 7 టీఆర్పీ రాబట్టి రికార్డు సృష్టించింది.. ఇక బిగ్ బాస్ ను ఆపేయ్యాలని ఒత్తిడి పెరుగుతున్న షో నిర్వాహకులు తగ్గేదేలేదు అంటున్నారు.. ఇప్పుడు త్వరగా సీజన్ 8ని నిర్వహించనున్నారు..

ఈ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారని సమాచారం.. గత ఐదేళ్లుగా నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ చేస్తున్నారు. ఆ కాన్సెప్ట్ కి ఆయన బాగా అలవాటు పడ్డారు.. అందుకే నాగ్ నే ఇక కంటిన్యూ చేసే ఆలోచనలో షో యాజమాన్యం ఉన్నారట.. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు.. మే, జూన్ నెలలో బిగ్ బాస్ సీజన్ 8 ని మొదలు పెట్టనున్నారని సమాచారం.. బిగ్ బాస్ లవర్స్ కు ఇక పండగ మొదలు కాబోతుందన్నమాట..