Gautham Krishna Eliminated from Bigg Boss Telugu 7 this week: బిగ్ బాస్ ఏడవ సీజన్ చివరికి వచ్చేసింది. ఇక ఏదేమైనా ఈ వారంలో అమర్ దీప్ మినహా హౌస్లో మిగిలిన ఏడుగురు అంటే శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే శివాజీ, ప్రశాంత్‌లు టాప్ లో ఉన్నారు. ఇక అంబటి అర్జున్ ‘ఫినాలే అస్త్ర’ గెలిచాడు కాబట్టి.. అతనైతే ఖచ్చితంగా టాప్ 5లో ఉండటం ఖాయమే సో ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక ప్రియాంక కూడా.. టాస్క్‌లలో బాగా పెర్ఫామ్ చేసింది దానికి తోడు అమర్ నామినేషన్స్‌లో లేకపోవడంతో అమర్ ఫ్యాన్స్ ఓట్లు ప్రియాంకకి పడ్డాయి. తొలి రెండు రోజులు అమర్ ఫ్యాన్స్ శోభాశెట్టికి వేసినప్పటికీ గౌతమ్‌తో ప్రియాంక తన పాయింట్లను అమర్‌కి ఇప్పించిందో అప్పటి నుంచి అమర్ ఫ్యాన్స్ ఓట్లు ప్రియాంక వైపు మళ్ళాయి.
Ambati Rambabu: నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
అలా ఈ వారం శివాజీ, ప్రశాంత్, అర్జున్, ప్రియాంకలు సేఫ్ గా ఉండగా డేంజర్‌లో ఉన్నది శోభాశెట్టి, యావర్, గౌతమ్ లు. అయితే ఈ ముగ్గురిలో టాస్క్‌ల పరంగా చూసినా బిహేవియర్ పరంగా చూసినా శోభ కంటే యావర్, గౌతమ్‌లు చాలా బెటర్ అంటున్నారు నెటిజన్లు. బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ కోటా కావడంతో ఇన్ని వారాలు హౌస్‌లో ఉండగలిగింది కానీ లేదంటే.. ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలని అంటున్నారు. ఈవారంలో కూడా శోభాశెట్టి లీస్ట్ ఓటింగ్‌లో ఉండడంతో ఆడియన్స్ ఓట్లను పరిగణలోకి తీసుకుంటే ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా.. శోభాని ఎలిమినేట్ చేయచ్చు కానీ ఏం జిమ్మిక్కులు జరిగాయో తెలియదు కానీ చివరికి గౌతమ్ ను ఇంటికి పంపడానికి రంగం సిద్ధం అయిందని అంటున్నారు.