Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..

Bigg Boss Telugu Season10

Bigg Boss Telugu Season10

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఈసారి “ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్” అనే వైవిధ్యమైన ట్యాగ్ లైన్‌తో బిగ్ బాస్ సరికొత్త ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. షో ప్రారంభమైన మొదటి వారం పూర్తికాకముందే ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హౌస్‌లోని సభ్యులను రెండు గ్రూప్‌లుగా విడదీసి, వారి మధ్యే పోటీలు పెట్టి హైరిస్క్‌లోకి వెళ్లే వారిని వారినే ఎంచుకోమనడం ఈ సీజన్‌కు కొత్త హంగులు తీసుకొచ్చింది. టాస్కుల్లో సత్తా చాటి టెంపర్ శివ, రోహిత్ నాయుడులతో పాటు రామ్ ప్రసాద్ పర్మినెంట్ హౌస్‌మేట్స్‌గా మారారు.

మరోవైపు హైరిస్క్‌లో ఉన్న కామనర్ చరణ్ ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. తాజాగా మరొకరు హైస్ నుంచి ఎలిమినేటర్ అయ్యారు. ఇప్పటికే హై రిస్క్ బ్యాడ్జి ధరించిన చైత్రా రాయ్‌తో పాటు సుధీర్, అమన్ మసూద్ హైరిస్క్ జోన్‌కు చేరుకోగా.. హై రిస్క్ లో ఉన్నవారి ఓటు ఆధారంగా చైత్రా రాయ్‌ను బిగ్ బాస్ ఇంటి నుంచి పంపించేసినట్లు ప్రచారం జరుగుతోంది. అమన్ మసూద్, సుధీర్ ఇద్దరు చైత్ర రాయ్‌కు ఓటేసి పంపిచేశారు. ఇలా ఒకే వారంలో ఇద్దరు కంటెస్టెంట్లు వెళ్లిపోవడంతో ఆట ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాక ప్రేక్షకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అయితే.. ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుల ఓటింగ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా హౌస్‌మేట్స్ నిర్ణయాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రేక్షకులు రోజువారీగా తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తున్నప్పటికీ, వారి ఓట్లకు విలువ ఇవ్వకుండా బిగ్ బాస్ యాజమాన్యమే సొంతంగా ఎలిమినేషన్లు చేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఓటింగ్ విధానాన్ని పక్కన పెట్టినప్పుడు జనాల నుంచి ఓట్లు సేకరించడం ఎందుకని, ఇది ఎంతవరకు న్యాయమని వ్యూయర్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు.