NTV Telugu Site icon

Priyanka Jain : ప్రియాంక జైన్, శివకుమార్ ల పెళ్లి అక్కడ ఎందుకు జరిగిందో తెలుసా?

Priyanka Jain

Priyanka Jain

బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పలు సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా సందడి చేసింది.. ఆ షోలో ప్రతి టాస్క్ లో యాక్టివ్ గా పాల్గొంటు అందరి మనసును దోచుకుంది.. ఇక హౌస్ లో ఉండగానే తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టింది. దాంతో ప్రియాంక జైన్, శివకుమార్ ల రిలేషన్ గురించి అందరికీ తెలిసింది..

అయితే, గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీళ్లు తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.. బిగ్‌ బాస్‌ షో నుంచి బయటకు రాగానే మ్యారేజ్‌ చేసుకుందామని చెప్పాడు ప్రియుడు శివ. కానీ ఇప్పటి వరకు ఎటువంటి రాలేదు.. చివరకు ఎలా ఒప్పించిందో తెలియదు కానీ.. ప్రియుడితో ఏడు అడుగులు వేసేంది.. వీరి పెళ్లికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

వీరిద్దరి పెళ్లి స్టార్ మా వేదిక పై జరగడం విశేషం.. ఉగాది పండగ స్పెషల్‌గా ఈ టీవీ ఛానెల్‌ వాళ్లు ఓ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ప్లాన్‌ చేశారు. మా ఇంటి పండగ అంటూ పది మంది జంటలతో ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్‌ని ప్లాన్‌ చేశారు.. అందులో భాగంగా వీరిద్దరు పెళ్లిచేసుకున్నారు.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది.. మొత్తానికి ఈ జంట మూడుముళ్లతో ఏకం అయ్యారు.. ఇద్దరు సీరియల్స్ లో రానిస్తూ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు అదే స్టార్ మా లో పెళ్లితో ఒక్కటైయ్యారు.. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..

Show comments