బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ షో దాదాపు ముగింపుకు చేరుకుంది.. 11 వ వారం ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు.. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ చెప్పాడు.. ఇక ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది సభ్యులుండగా.. 12 వారం నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రతికా , యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, అమర్ దీప్, అశ్విని ఇలా 8 మంది నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. వీరికి మంగళవారం నుంచి నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ఓటింగ్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు..
గత 11 వారాలుగా టాప్ ఓటింగ్ దూసుకుపోతున్న శివాజీ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచాడు.. అమర్ దీప్ చౌదరి 17.41 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 11.5 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, 8.89 శాతంతో ఐదో స్థానంలో గౌతమ్ కృష్ణ హౌజ్‌లో కొనసాగుతున్నారు. ఇక రతికా రోజ్ 4.28 శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ఇన్నే ఓట్లతో సమీపంలోనే అర్జున్ అంబటి కూడా ఉన్నాడు. ఇక చివరిగా అశ్విని శ్రీ ఏడో స్థానంలో ఉంది..
ఏ వారం డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం రతిక, అర్జున్, అశ్విని.. ఈ వారం నాగ్ చెప్పినట్లుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ ముగ్గురిలోంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.. ఒక వేళ బిగ్ బాస్ ఓటింగ్‌నే పరిగణనలోకి తీసుకుంటే అర్జున్, అశ్విన్ ఈ వీక్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతారు. అయితే ఎవిక్షన్ పాస్‌తో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చాన్స్ పల్లవి ప్రశాంత్ కు ఉంది. మరి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్‌తో ఎవరినైనా సేవ్ చేస్తాడా? చేస్తే ఎవరిని చేస్తాడు అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే..