Site icon NTV Telugu

సింగర్ శ్రీరామచంద్ర… రాముడా? కృష్ణుడా?

Sriramachandra

Sriramachandra

ఇండియన్ ఐడిల్, సింగర్ శ్రీరామచంద్ర చక్కని గాయకుడు మాత్రమే కాదు… నటుడు కూడా. అతని కొన్ని సినిమాలో కీలక పాత్రలను, ఒకటి రెండు సినిమాలలో హీరో పాత్రను పోషించాడు. బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీరామచంద్ర వచ్చాడనగానే అతని గొంతు నుండి కనీసం రోజుకు ఒక పాట అయినా వినవచ్చని వ్యూవర్స్ ఆశపడ్డారు. మరి శ్రీరామచంద్ర పాడటం లేదో… లేక వాటిని బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఎడిటింగ్ టీమ్ కట్ చేస్తున్నారో తెలియదు కానీ… పాటలనైతే వ్యూవర్స్ మిస్ అవుతున్నారు. బహుశా అందుకే కావచ్చు… శ్రీరామచంద్రతో నాగార్జున శనివారం ఓ పాట పాడించాడు. దాంతో ‘ప్రేమదేశం’ సినిమాలోని ‘ముస్తాఫా… ముస్తాఫా…’ సాంగ్ పల్లవి పాడారు శ్రీరామచంద్ర.

Read Also : ఆరుగురిలో ఆ ఇద్దరూ సేఫ్!

ఇక ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీరామచంద్ర బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీ ప్రపోజల్ చేయలేదా! అనే చర్చకూడా శనివారం వచ్చింది. ఇక్కడ ఒకటి కాదు రెండు మూడు ట్రాక్స్ నడుస్తున్నాయని ప్రియా సరదాగా చెప్పడమే కాదు… ఆ ట్రాక్స్ నడిపిస్తోంది సిరి, ప్రియాంక అంటూ లీక్ చేసేసింది. అలాంటిదేమీ లేదని శ్రీరామచంద్ర చెప్పినా… ‘ఆయన పేరులోనే రాముడు ఉన్నాడు… నిజానికి అన్నీ కృష్ణుడి లక్షణాలే’ అంటూ మరికొందరు ఆటపట్టించారు. దాంతో నాగార్జున… నీ పేరును అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండు అని శ్రీరామచంద్రకు హిత బోధ చేయడం విశేషం.

Exit mobile version