NTV Telugu Site icon

‘బిగ్ బాస్ 5’ విన్నర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే ?

Sunny

Sunny

తెలుగు బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ సీజన్-5” విజవంతంగా పూర్తయ్యింది. గ్రాండ్ ఫినాలేకు రాజమౌళి, అలియా భట్, రణబీర్ కపూర్, సాయి పల్లవి, నాని, కృతి శెట్టి, రష్మిక మందన్న, సుకుమార్ వంటి స్టార్స్ హాజరు కావడంతో మరింత గ్రాండ్ గా జరిగింది. అయితే గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు హౌజ్ మేట్స్ ఉండగా, అందులో సన్నీ ఈ సీజన్ కు విజేతగా నిలిచారు. ఆయనకు 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక ఖరీదైన బైక్, అలాగే సువర్ణ భూమి ల్యాండ్ ను బహుమతిగా అందజేశారు. దీంతో సన్నీ రెమ్యూనరేషన్ ఎంత ? ఆయన జేబులో పడేది ఎంత అనే విషయంపై చర్చ జరుగుతోంది. సన్నీకి అంతా కలిపి కోటి రూపాయల దాకా రాగా, అందులో టాక్సులు మినహాయించి, అతనికి దక్కేది తక్కువే. ఈ నేపథ్యంలో ఇప్పుడు విన్నర్ సన్నీ కంటే మరో కంటెస్టెంట్ ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

“బిగ్ బాస్-5” రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ ఆ కంటెస్టెంట్ అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో జశ్వంత్ రెమ్యునరేషన్ హాట్ టాఫిక్. ఈ సీజన్ లో షణ్ముఖ్ కు ఉన్న క్రేజ్ కారణంగా షో మేకర్స్ ఆయనకు వారానికి రూ.4 నుంచి 5 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే 15 వారాలకు షణ్ముక్ రూ.65 లక్షల పైనే రెమ్యూనరేషన్ గా అందుకున్నాడు అన్నమాట. ఇది విన్నర్ సన్నీ ప్రైజ్ మనీ కంటే ఎక్కువే మరి !