NTV Telugu Site icon

తండ్రి కాళ్ళకు దండం పెట్టి కన్నీళ్ళు పెట్టిన నాగార్జున!

NAgarjuna

NAgarjuna

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చాలా ప్రాక్టికల్ మనిషి. పిల్లలను సైతం అలానే పెంచారు. దాంతో సంప్రదాయ బద్ధంగా తండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టడం వంటివి వారికి అలవడలేదు. బిగ్ బాస్ సీజన్ 5 షోలో నాగార్జున ఇదే విషయాన్ని తెలియచేశారు. శనివారం షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ – నాగ్ మధ్య ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ‘ట్రిపుల్ ఆర్’ ఎలా వస్తోందని నాగ్ అడిగినప్పుడు ఇంతవరకూ తాను ఒక్క సీన్ కూడా చూడలేదని చెర్రీ బదులిచ్చాడు. చరణ్ కు చూపించినా చూపించకపోయినా… తనకైనా మూవీ చూపించమంటూ నాగ్… రాజమౌళిని ఉద్దేశించి చెప్పాడు.

Read Also : బిగ్ బాస్ షో లో చెర్రీ స్వామి కార్యం… స్వకార్యం!

ఇక ‘ఆచార్య’ షూటింగ్ విశేషాలను గురించి అడిగినప్పుడు చెర్రీ ఎమోషన్ అయ్యాడు. తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంటుందని, ఇంట్లో కూడా కాస్తంత దూరం పాటించే తాను షూటింగ్ లో భాగంగా చాలా సన్నిహితంగా మెలగడం ఎంతో ఆనందాన్ని కల్గించిందని చెర్రీ చెప్పాడు. దాంతో నాగార్జున తన కెరీర్ ప్రారంభ దినాలను గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి నాగేశ్వరరావు తో కలిసి నటించినప్పుడు కూడా తాను ఇదే రకమైన ఎగ్జైట్ మెంట్ కు లోనయ్యానని చెప్పాడు. ఇంటిలో ఎప్పుడూ ఆయన కాళ్ళకు దండం పెట్టే అవసరం కలగలేదని, కానీ సినిమా షూటింగ్ లో భాగంగా తండ్రి కాళ్ళకు దండం పెట్టినప్పుడు అసంకల్పితంగా తన కళ్ళ నుండి నీళ్ళు కారాయని నాగ్ తెలిపాడు. మొత్తం మీద ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవడానికి బిగ్ బాస్ వేదిక చక్కగా ఉపయోగపడింది.