NTV Telugu Site icon

“బిగ్ బాస్ 5” టీఆర్పీ… ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన నాగ్ !

Bigg Boss Telugu 5 launch episode gets a good rating of 15.7

“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో నాగార్జున 5 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటూ చాలా ఉత్సాహంగా షోను హోస్ట్ చేశారు. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ను పరిచయం చేస్తూ హోస్ట్ గా నాగార్జున చేసిన ఫన్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల నుంచి బిగ్ బాస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఖుషి అయ్యారు. అయితే 19 మంది కంటెస్టెంట్లలో కొంతమంది యూట్యూబర్లు రాగా, మరికొంతమంది యాంకర్లు… మిగతా వాళ్ళు అసలు ఎవరికీ తెలియకపోవడంతో కొంత వరకు విమర్శలు కూడా వచ్చాయి. సిరి, సన్నీ, లహరి, అనీ, శ్రీరామ చంద్ర, లోబో, ప్రియా, జెస్సీ, ప్రియాంక, షణ్ముఖ్, హమీదా, నటరాజ్, సరయు, విశ్వ, ఉమాదేవి, మానాలు, కాజల్, శ్వేత మరియు రవి సహా 19 మంది పోటీదారులు హౌజ్ లోకి ప్రవేశించారు. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ లో సరయు షోకి వీడ్కోలు పలికింది. తాజాగా సెకండ్ వీక్ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి.

Read Also : బిగ్ బాస్ 5 : వాళ్ళను గుర్తు చేస్తున్నావ్… సిరిపై ట్రోలింగ్

తాజాగా “బిగ్ బాస్ 5” లాంచ్ ఎపిసోడ్ కు సంబంధించిన టీఆర్పీ రేటింగ్ రివీల్ అయ్యింది. నాగార్జున హోస్ట్ చేసిన ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు 15.71 టిఆర్పి రేటింగ్ వచ్చింది. టీఆర్పీ పరంగా నాగ్ తన రికార్డును తానే బ్రేక్ చేయలేకపోయాడు. షో ప్రీమియర్ రోజున తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు రేటింగ్‌ని ప్రభావితం చేశాయి. నాగ్ హోస్ట్ గా వ్యవహరించిన గత సీజన్ “బిగ్ బాస్ తెలుగు 4” 18.5 టీఆర్పీ సాధించడం విశేషం.

“బిగ్ బాస్” మొదటి సీజన్ నుంచి ఇప్పటి వరకు టీఆర్పీ రేటింగ్ :
జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా బిగ్ బాస్ తెలుగు 1 – 16.18 టీఆర్పీ
నాని హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 2 – 15.05 టీఆర్పీ
నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 3 – 17.9 టీఆర్పీ
నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 4 – 18.5 టీఆర్పీ
నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 5 – 15.71టీఆర్పీ