NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : ఈ సీజన్లో ఆ ట్విస్ట్ లేనట్టేనా… మేకర్స్ షాకింగ్ నిర్ణయం ?

Bigg-Boss-5

Bigg-Boss-5

సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో నిన్న రాత్రి మూడవ ఎపిసోడ్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడవసారి నాగార్జున బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటిసారిగా 19 మంది పోటీదారులతో బిగ్ బాస్ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో పోటీదారులతో ప్రీమియర్ అయిన ఏకైక సీజన్ ఇదే. బుల్లితెర ప్రేక్షకులకు బోరింగ్ ను దూరం చేస్తామని, 5 రెట్లు ఎక్కువ వినోదాన్ని అందిస్తామంటూ మొదలు పెట్టిన ఈ షోలో మొదటివారం ఎలిమినేషన్ కోసం ఆరుగురు పోటీదారులు నామినేట్ అయ్యారు.

తాజా సీజన్లో సగం మంది కంటెస్టెంట్స్ ఎవరో కూడా ఆ షో చూసేవాళ్లెవరికి తెలియదు. దీంతో ప్రారంభంలోనే ‘బిగ్ బాస్’ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రతిసారి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ఓ స్పెషల్ ట్విస్ట్ ఈసారి ఈ సీజన్ లో ఉండబోదని అంటున్నారు.

Read Also : బిగ్ బాస్-5 : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది తనేనా ?

“బిగ్ బాస్-5″లో అసలు ఆ ట్విస్ట్ వుంచకూడదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. రియాలిటీ షో “బిగ్ బాస్ 5” సీజన్‌లో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదని వార్తలు వస్తున్నాయి. దీనికి కరోనా కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు. మరోవైపు ఫస్ట్ వీక్ వచ్చే టిఆర్పీ రేటింగ్‌ల ఆధారంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తాజా, పాపులర్ ముఖాన్ని షోలోకి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు లభించిన “పవర్ రూమ్” యాక్సెస్ కూడా ‘బిగ్ బాస్’ కొత్తగా ప్రవేశ పెట్టిందే. ఇది ఇంతకుముందు సీజన్లలో లేదు. అలాగే ఈ సీజన్లో చాలా కొత్త సర్ప్రైజ్ లను మేకర్స్ ప్లాన్ చేశారని అంటున్నారు. కాగా ఈ రియాలిటీ షో వారం ఎపిసోడ్‌లు రాత్రి 10 గంటలకు, వారాంతపు ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతాయి.