NTV Telugu Site icon

Bigg Boss Telugu 8: ‘బిగ్ బాస్ 8’.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళే

Biggboss8

Biggboss8

Bigg Boss Telugu 8: బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 8కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆదివారం వారం గ్రాండ్ గా స్టార్ట్ కాబోతున్న ఈ షో గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం.

ఈసారి ఈ షోలో అసలు ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఫస్ట్ ఫేజ్ లో ఎంతమంది లోపలికి వెళ్లారు, ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు అనేది చూద్దాం. అయితే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ 8 కి స్క్రీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనే డిస్కషన్ అంతా వచ్చినప్పుడు మాత్రం కొంతమంది పేర్లు అనూహ్యంగా తెరపై వచ్చిన చాలా హల్చల్ చేశాయి. ఫస్ట్ నుంచి వాళ్లే ఈ సీజన్ కంటెస్టెంట్స్ అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఫైనల్ గా చూసుకుంటే మాత్రం ఎవరెవరైతే ఫస్ట్ నుంచి ఉంటారని ఊహించారో వాళ్ళందరూ లేకుండా పోయారన్నమాట. ఎందుకు ఇలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం.

రీతూ చౌదరి:
రీతూ చౌదరికి సోషల్ మీడియాలో ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు.వాళ్ళందరూ అక్కడ రీతూ ఇచ్చే కంటెంట్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి ఆమె ఈ షో కి వస్తే మంచి హైప్ వస్తుంది అనుకున్నారు.కానీఈ సీజన్ లో రీతూ లేదు.ఏం జరిగిందో తెలియదుకానీ ఫైనల్ గా రీతు ఎందుకు రాలేదు అనేది మాత్రం అదొక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది.

తేజస్విని గౌడ :
గత సీజన్ రన్నర్ అయిన అమర్ దీప్ వైఫ్ తేజు.తేజస్విని గౌడ నటిగా ఉన్నప్పుడే ఆమెకి సూపర్ ఫాలోయింగ్ ఉండేది.అమర్ హౌస్ లోపల ఉన్నప్పుడు కూడా తేజు ఎంత కష్టపడింది, అమర్ కి ఓట్లు పడడానికి కూడా ఆమె తనవంతుగా ఏమేం చేసింది అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే తేజు కూడా ఈ సీజన్ కి కన్ఫర్మ్ అనుకున్నారు. అయితే ఆమె వారానికి నాలుగు లక్షలు అడుగుతుంది అనే డిస్కషన్స్ కూడా వచ్చాయి. స్టార్ మా కూడా ఆల్మోస్ట్ తీసుకుంటుంది అనేదాకా కూడా వెళ్ళింది. బట్ ఫైనల్ గా ఏమైందో తెలియదు మొత్తానికి తేజు అయితే మాత్రం ఈ సీజన్లో లేదు. ఎందుకు లేదు అనేది మాత్రం వాళ్లకి తెలియాలి.

అంజలి పవన్ :
గత సీజన్ లో ఈమె పేరు గట్టిగా వినిపించింది. ఈసారి మాత్రం కన్ఫర్మ్ అనుకున్నారు.కానీ ముందు నుండి వినిపించిన ఆమె పేరు మాత్రం ఈ సారి మనకు అందిన మొదటి జాబితాలో లేదు.మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ఏమైనా ఉంటుందా అనేది చూడాలి.

ఇంద్ర నీల్ :
ఈసారి ఇంద్ర నీల్ హౌస్ ఎంట్రీ పక్కా అని చాలా మాటలు వినిపించాయి. అవన్నీ రూమర్స్ అని ఒక వీడియోతో కొట్టిపడేసాడు ఈ సీరియల్ స్టార్. అయితే ఇంద్ర నీల్ షో కి వెళ్లుంటే బావుండేది. ఎందుకంటే ఆయన నటించిన బ్లాక్ బస్టర్ సీరియల్స్ కి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ఉంది. ఇంద్ర నీల్ వాళ్ళు ఉంటే కనుక ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఈ బిగ్ బాస్ షో అనేది ఎంగేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది.

కుమారి ఆంటీ :
ఇక నెక్స్ట్ బాగా వినిపించిన పేరైతే మాత్రం కుమారి ఆంటీ. ఎప్పుడైతే ఒక ఇష్యూ నడిచి ఆమె షాప్ క్లోజ్ చెయ్యడం,రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి ఆమె షాప్ ఓపెన్ చేసుకోమని చెప్పడంతో ఆమె పేరు మార్మోగింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బిగ్ బాస్ కి వెళ్లిపోద్దని చెప్పుకున్నారు. మా టీవీలో వచ్చిన షోస్ లోకూడా కనిపించడంతో ఈసారి ఛాన్స్ ఉందని చాలామంది అనుకున్నారు.ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో వంట అనేది కూడా ఒక పెద్ద యుద్ధమే.అక్కడ కూడా ఒక పెద్ద మాటలు యుద్ధం జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే కుమారి ఆంటీ కూడా వెళ్లట్లేదు.

మిగతా వాళ్ళు వీరే:
బ్యాంకాక్ పిల్ల వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో ఆమె బిగ్ బాస్ లోకి వెళుతుంది అనే వీడియోస్ కూడా అంతే పాపులర్ అయ్యాయి. కానీ ఆమె కి కూడా వెళ్లట్లేదు. ఆస్ట్రేలియా లో ఉండే పాపులర్ వ్లాగర్ నందు రామిశెట్టి కూడా బిగ్ బాస్ కి వెళ్లట్లేదు అని ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య పొలిటికల్ రిలేటెడ్ వీడియోస్ తో బాగా పాపులర్ అయిన కిరాక్ RP లోపలికి అని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు.

లోపలికి వెళ్ళింది వీళ్ళే :
మామూలుగా అయితే బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా 15 మంది పైగానే కంటెస్టెంట్స్ ఉంటారు. ఈ సారి మాత్రం కొంచెం కొత్తగా ప్లాన్ చేశారన్నమాట. ఫస్ట్ ఫేజ్ లో 14 మందిని పంపిస్తున్నారు. 14 మంది అనేది చాలా తక్కువ నెంబర్. 15 వారాలు షోకి 14 అంటే ఇంకా చాలామందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలకి పంపాల్సి ఉంది. దాదాపు 5 నుంచి 6 మంది లోపలికి వచ్చే అవకాశం ఉందన్నమాట. మనకున్న సమాచారం ప్రకారం కొన్ని పేర్లు చూస్తే కనుక… ఫస్ట్

బెజవాడ బేబక్క
తన ఇంస్టాగ్రామ్ వీడియోలతో పాటు సోషల్ మీడియాలో గట్టిగా సందడి చేసే బెబక్క లోపలికి వెళ్లిందంటే కాస్త సందడి ఉండొచ్చు.

హీరో ఆదిత్య ఓం
ఈ మధ్యన సినిమాలు పెద్దగా లేవు. అయితే అతను జనాలతో బిహేవ్ చేస్తే తీరు బావుంటుంది, అలాగే పేస్ వేల్యూ కూడా ఉంది కాబట్టి అతన్ని తీసుకున్నారు అని తెలుస్తుంది.

యష్మి గౌడ & ప్రేరణ కంభం
‘కృష్ణ ముకుందా మురారి’ సీరియల్ లో రెండు కీ క్యారెక్టర్స్ ప్లే చేసిన యష్మి గౌడ & ప్రేరణ కంభం ఇద్దరు కూడా సీజన్ 8 లో కనిపించబోతున్నారు. కృష్ణ ముకుందా మురారి అనే సీరియల్ టాప్ రేటెడ్ సీరియల్ కావడం, ఆ సీరియల్ లో నటించి ఈ ఇద్దరు ఫేమస్ అయ్యారు కాబట్టి వీళ్ళని తీసుకున్నారు.


విష్ణు ప్రియ
విష్ణు ప్రియ హౌస్ లో అలరించడానికి రెడీ అయ్యింది.ఆమె గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె ఆమెలా ఉంటే చాలు టాప్ 5 కి వచ్చినట్టే.

అభయ్ నవీన్
అభయ్ నవీన్ కూడా సీజన్ 8 లో పక్కాగా ఉండబోతున్నాడు అనే టాక్ వినిపించింది.ఇప్పుడు అదే పేరు కన్ఫర్మ్ అంటున్నారు.ఇతను చూడడానికి చాలా కామ్ గా ఉంటాడు.. అలాంటి వ్యక్తి ఫైర్ అయితే మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంటుంది.

వీళ్ళతో పాటు ఢీ నైనిక, కిర్రాక్ సీత కూడ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది.


శేఖర్ బాషా,నాగ మణికంఠ,నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్ అని చెప్పుకోవచ్చు.



ఇలాంటి పేర్లతో ఇంకా స్టార్ట్ కాకుండానే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ముందు ముందు ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Show comments