NTV Telugu Site icon

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌజ్ నుంచి రతికా అవుట్.. మరోసారి బుక్కయిన రైతుబిడ్డ..

Prasanth Rathika

Prasanth Rathika

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం సస్పెన్స్ లతో ఎపిసోడ్ ఆసక్తిగా మారింది.. గతవారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల నిన్నటి ఎపిసోడ్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది.. అశ్విని ఎలిమినేట్ అవుతూ హౌస్ లో తన జర్నీని స్క్రిన్ చూసిన తర్వాత హౌజ్ మేట్స్ పై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. అయితే అశ్విని నుంచి నాగ్ కొన్ని అభిప్రాయాలను సేకరించారు.ఇప్పుడు ఉన్న బ్యాచ్ లో హిట్, ఫట్ ఎవరనే దానిపై తన ఫీలింగ్ ను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగ్ హౌజ్ లోని మూడు బ్యాచ్ లకు పేర్లను పెట్టారు. శోభా, ప్రియాంక, అమర్ – స్పా/చుక్క బ్యాచ్ అని, శివాజీ, అమర్, ప్రశాంత్ -స్పై/మొక్క బ్యాచ్ అని, మిగితాది తొక్క బ్యాచ్ అంటూ హౌజ్ లోని బ్యాచ్ లపై సరదా ఫన్నీకామెంట్లు చేశారు.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇకపోతే శివాజీ, అమర్, గౌతమ్, శోభాశెట్టి, రతిక, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, యావర్, అర్జున్ ఉన్నారు. వీరిని రెండు బ్యాచ్ లుగా ఏర్పాటు చేశారు నాగ్. స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ గా విడదీశారు. వీరితో క్విజ్ పోటీని ఆడించారు.. ఒక్కొక్కరికి మార్కులను బిగ్ బాస్ ఇచ్చాడు.. అర్జున్ సంచాలకుడిగా ఉన్నారు. మిగితా వారు గేమ్ ఆడారు. హౌజ్ లోని వస్తువులు, ఇంటిరియర్, ఫర్నీచర్, తదితర వస్తువులపై ఉన్న కలర్ తదితర అంశాలను ప్రశ్నలుగా అడిగారు. ఈ క్విజ్ లో స్పై బ్యాచ్ గెలిచింది.. ఇలా మరిన్ని గేమ్స్ ను ఆడించారు బిగ్ బాస్.. అలా సండే ఎపిసోడ్ కాస్త సందడి సాగింది..

ఎలిమినేషన్ కు ముందుకు పల్లవి ప్రశాంత్ తన ఎవిక్షన్ పాన్ ను వినియోగించాలని అడిగారు. కానీ పద్నాలుగో వారం వాడుతానని తప్పించుకున్నారు. ప్రియాంక ఎంత బతిమిలాడినా పట్టించుకోలేదు.. దాంతో రతిక కూడా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.. వైల్డ్ కార్డు ఎంట్రీతో రెండో సారి హౌజ్ లో అడుగుపెట్టి ఇప్పటి వరకు గేమ్ ఆడుతూ వచ్చింది. ఇక 12వ వారంలో మళ్లీ ఎలిమినేట్ అయ్యింది. మొదట 28వ రోజుకే హౌజ్ ను వీడింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో 49వ రోజు మళ్లీ వచ్చింది. 35రోజులు హౌజ్ లో ఉండి 84వ రోజున ఎలిమినేట్ అయ్యింది. వెళ్లిపోతూ పోతూ తనమీద తనే ఓటేసుకుంది.. మొత్తానికి చూసుకుంటే హౌస్ లో ముగ్గురు ఇంటి నుంచి వీడినట్లు తెలుస్తుంది.. ఈరోజు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది.. ఎవరు ఈవారం ఎలిమినేట్ అవుతారో చూడాలి..