NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: పుష్ప స్టైల్లో వెళ్లి రెచ్చిపోయిన రైతు బిడ్డ.. మామూలోడు కాదు

Pallavi

Pallavi

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 మొదలయ్యింది. మూడు రోజులు కాకముందే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తో నామినేషన్ ముగిసింది. ఇక మొదటి నామినేషన్ అవ్వగానే బిగ్ బాస్ గేమ్స్ లోకి దిగాడు. ” శారీరకంగా, మానసికంగా.. తమను తాము ప్రేక్షకులకు నిరూపించుకుంటూ చివరికి విజేతగా నిలిచిన ఒక్కరు బిగ్ బాస్ సీజన్ 7 లో ఏకంగా 5 వారాల ఇమ్మ్యూనిటీని పొందే అవకాశం వస్తుంది” అని చెప్పి.. ఇద్దరు కుస్తీ ప్లేయర్స్ ను హౌస్ లోకి పంపాడు. ఇక వారిని ఎవరైతే రింగ్ నుంచి బయటకు పంపిస్తారో.. వారే విన్నర్ ని బిగ్ బాస్ తెలిపాడు. ఇక ఆ కుస్తీ ప్లేయర్స్ ను చూస్తూనే కంటెస్టెంట్స్ కు భయంతో చెమటలు పట్టాయి. ఒక్కొక్కరిగా.. రింగ్ లోపలికి వెళ్లి తమ సత్తా చూపడానికి రెడీ అయ్యారు.. కానీ, ఒక్కరైనా సీరియస్ గా వారితో ఫైట్ చేయలేకపోయారు. ప్రిన్స్, ఆట సందీప్ కొద్దిగా సీరియస్ గా తీసుకొని కొద్దిసేపు తమ బలాన్ని చూపించారు.

Aadikeshava: సిత్తరాల సిత్రావతి వెంటపడుతున్న ఆదికేశవుడు

ఇక అస్సలు ఇప్పటివరకు ఒక యూట్యూబర్ గా అందరికీ తెల్సిన పల్లవి ప్రశాంత్.. పుష్ప స్టైల్లో రంగంలోకి దిగి.. కుస్తీ వీరుడును మట్టికరిపించినట్లు ప్రోమోలో కనిపిస్తుంది. అల్లు అర్జున్ లా భుజం పైకెత్తి వెళ్లి.. ఆ కుస్తీ వీరుడు కాలును గట్టిగా పట్టుకొని.. వదలకుండా కొద్దిసేపు ఆపగలిగాడు. ఇక చివర్లో కాంతార స్టైల్లో ఓ అంటూ అరిచి.. విజయాన్ని అందుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఆ గేమ్ తరువాత కంటెస్టెంట్స్ ల మబ్బు విడిపోయింది. సాధారణంగా కనిపించే రైతు బిడ్డలో ఇంత సత్తా ఉందని వారు గుర్తించేలా చేశాడు పల్లవి ప్రశాంత్. శివాజీ సైతం వీడు మామూలోడు కాదు అని చెప్పి షాక్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments