NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: హౌస్లోకి గౌతమ్ రీ ఎంట్రీ…వస్తూనే శివాజీకి షాక్..

Bigg Gowtham

Bigg Gowtham

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో రోజుకో విధమైన క్రేజ్ ను అందుకుంటుంది.. ఆదివారం బిగ్ బాస్ తెలుగు 7 రీ లాంచ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. అలాగే హోస్ట్ నాగార్జున డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చారు. శివాజీ, అమర్ దీప్, యావర్, గౌతమ్, శుభశ్రీ.. అందులోనుంచి శుభశ్రీ బాటమ్ త్రీలో ఉందని ఎలిమినేట్ చేశారు. ఇక మిగతా ఆరుగురిలో శివాజీ, ప్రియాంక, యావర్, అమర్ దీప్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి తేజా-గౌతమ్ మిగిలారు. వీరిలో ఒకరిని ఇంటికి పంపాలని ఇంటి సభ్యుల నిర్ణయాన్ని బిగ్ బాస్ ఒప్పుకున్నారు..

తేజాకు వ్యతిరేకంగా ఒక్క సందీప్ మాత్రమే ఓటు వేశాడు. దీంతో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. కాగా నాగార్జున గౌతమ్ కి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. తనను సీక్రెట్ రూమ్ కి పంపుతున్నట్లు వెల్లడించాడు. దాదాపు 34 గంటలు ఒక్కడే సీక్రెట్ రూమ్ లో ఉన్న గౌతమ్ ఆట గమనించాడు.. నిన్న జరిగిన ఎపిసోడ్ లో గౌతమ్ రెచ్చిపోయాడు. నామినేషన్స్ డే బయటకు వచ్చాడు. వస్తూ వస్తూనే భారీ డైలాగ్స్ కొట్టాడు. రాననుకున్నారా రాలేననుకున్నారా?. నేను అశ్వద్ధామ. ఈ అశ్వద్ధామకు చావు లేదంటూ తనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన హౌస్ మేట్స్ ని హెచ్చరించాడు. అనంతరం శివాజీతో గొడవకు దిగాడు. గౌతమ్ ఎంటర్టైన్ చేయలేడు అని చెప్పావు. ఎంటర్టైన్మెంట్ అంటే ప్యాంటు విప్పుకుని తిరగడమా… అని గౌతమ్ ప్రశ్నించాడు. బట్టలు లేకుండా తిరగడం ఎంటర్టైన్మెంటా అని ఇంత మంది ముందు అడుగుతున్నావు. నేను బట్టలు లేకుండా 90 సినిమాలు చేశాను అని శివాజీ కౌంటర్ వేశాడు. నేను యాక్టర్ ని ఏదైనా చేస్తా అన్నాడు..

ఒకరికి మరొకరు గట్టిగా కౌంటర్ ఇచ్చుకున్నారు.. కాసేపు వీరిద్దరూ మాటలు హౌస్ ను వేడెక్కించాయి.. ఇక ఈరోజు నామినేషన్స్ జోరుగా సాగుతున్నాయి.శోభా ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే మాత్రం కొత్తగా వచ్చిన నాయని పావని,అశ్విని,పూజ మూర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.ఓటింగ్ వారం మొత్తం జరిగిన ఆటను బట్టి తారుమారు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు వేచి చూడాల్సిందే. తేజా ప్రతి వారం ఎలిమినేషన్ అంచుల వరకు నక్క తోక తొక్కినట్టు లక్ తో తిరిగి వస్తున్నాడు. ఇక అమర్ మీద ఆడియన్స్ లో విపరీతమైన నెగెటివిటీ పెరిగిపోయింది.. దీంతో ఈ వారం అమర్ వెళ్ళిపోతాడేమో అని జనాలు అంటున్నారు మరి ఎవరు వెళతారో చూడాలి..

Show comments