NTV Telugu Site icon

Bigg Boss Telugu 7 : ఫినాలే రేస్.. అదరగొట్టిన రైతుబిడ్డ.. అమర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న యావర్..

Amar Prasanth

Amar Prasanth

తెలుగులో టాప్ రియాలిటి షోగా దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ జరుపుకుంటుంది.. ఫినాలే అస్త్ర టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. హౌజ్ లో ప్రస్తుతం మొత్తం ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే మిగిలారు.. ఈ ఎనిమిది మందిలో నిన్నటి వరకు జరిగిన టాక్స్ లో ప్రియాంక, శోభాశెట్టి, శివాజీలు నేటితో సంచాలకులుగా మారారు. ఈరోజు ఏడు, ఎనిమిది, తొమ్మిదో టాస్క్ లు ఈరోజు చాలా ఆసక్తికరంగా మారింది.. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అని జనాలు ఆసక్తి చూపిస్తున్నారు..

క్రికెట్ టాస్క్ లో అమర్ టాప్ లో నిలిచాడు.. ఆ తర్వాత అర్జున్, ప్రశాంత్, యావర్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఆ తర్వాతి టాస్క్ ‘తప్పింకుచో రాజా’లో ప్రశాంత్ అదరగొట్టారు. అలాగే అమర్ దీప్ కూడా చక్కగా ఆడారు. యావర్, గౌతమ్, అర్జున్ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇదే సమయంలో అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఈ విషయాన్ని శోభా,ప్రియాంకలు కూడా అభిప్రాయ పడ్డారు..ఆ టాస్క్ లో కాళ్లకు లాక్స్ తో కట్టిన చైన్ లను పోటీదారులు విడిపించుకోవాల్సి ఉంటుంది. అయితే కీ మొదట తీసుకున్న ప్రశాంత్ టార్గెట్ ను రీచ్ అయ్యారు. ఆ వెంటనే తిరిగి వెళ్లిన అమర్ దీప్ మాత్రం కీస్ ను గందరగొళంగా పడేయడంతో అర్జున్ చివర్లో మిగిలిపోయాడు.

ఇక అర్జున్ చేసిన పనికి శివాజీ కూడా గొడవకు దిగాడు.. ఆ తర్వాత యావర్ తన పాయింట్స్ ను కోల్పోయాడు.. ఇకపోతే రైతుబిడ్డ మాత్రం ప్రతి టాస్క్ లోనూ అదరగొడుతున్నాడు. ఈరోజు జరిగిన టాస్క్ ల్లో ప్రతి గేమ్ లో తన నైపుణ్యాన్ని కనబర్చిరారు. సూపర్ గా ఆడి ఆకట్టుకున్నారు. మరోవైపు అమర్ దీప్ కూడా టాస్క్ లతో ఆకట్టుకుంటున్నారు. మంచి స్కోర్ చేస్తున్నారు. దీంతో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫినాలే అస్త్ర విన్నర్ గా నిలిచినట్లు తెలుస్తుంది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈరోజు చూడాలి..

Show comments