బిగ్ బాస్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతుంది.. ఈ వారం 12 వారానికి నామినేషన్స్ జరుగుతున్నాయి.. హౌస్ లో ప్రస్తుతం 10 మంది ఉన్నారు.. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఈసారి ఫలితాలు అనూహ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. టైటిల్ ఫేవరేట్స్ కి షాక్ తగిలిందని అంటున్నారు.. గత వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. అవిక్షన్ పాస్ గెలిచిన యావర్ దాన్ని తిరిగి ఇచ్చేశాడు. ఈ కారణంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశాడు. వచ్చే వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ అన్నారు.
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది.. శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, అశ్విని, రతిక, గౌతమ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. మంగళవారం రాత్రి 10:30 నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.. తమకు కావలసిన వాళ్లకు ఓట్లు వేశారు బిగ్ బాస్ ఆడియన్స్.. ఈ నామినేషన్స్ లో అనూహ్య పరిణానామాలు చోటు చేసుకున్నాయి.. ఈ వారంకు శివాజీ, పల్లవి ప్రశాంత్ లను వెనక్కి నెట్టి అమర్ దీప్ టాప్ లోకి వచ్చాడట. శివాజీ, పల్లవి ప్రశాంత్ టైటిల్ ఫెవరేట్స్ గా ఉన్నారు. వారు ఎప్పుడు నామినేషన్స్ లోకి వచ్చినా టాప్ లో కొనసాగుతున్నారు. ఈసారి మాత్రం వారు 2, 3 స్థానాలకు పడిపోయారని సమాచారం…
ఈ వారం టాప్ లో అమర్ దీప్ ఉండగా, శివాజీ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు.. రైతు బిడ్డ మూడో స్థానంలో, యావర్ నాలుగో స్థానం ఇక ఆ తర్వాత ప్రియాంక మొదలగు వాళ్లు లిస్ట్ లో ఉన్నారు.. రతిక, అశ్వినిలలో ఒకరు ఎలిమినేట్ కావడం మాత్రం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. కారణం ఉన్న వాళ్లలో వీరిద్దరే వీక్ కంటెస్టెంట్స్.. మిగిలిన వారిలో నెక్స్ట్ వీక్ ఎవరు అవుతారో చూడాలి.. ఈరోజు ఎపిసోడ్ మరింత రసవత్తరంగా ఉండబోతుందని తెలుస్తుంది..