NTV Telugu Site icon

కంటెస్టెంట్స్ కు క్లాస్ పీకిన నాగ్!

Bigg Boss Telugu Season 5

Bigg Boss Telugu Season 5

బిగ్ బాస్ సీజన్ 5 షో థర్డ్ ఎలిమినేషన్ వరకూ వచ్చేసింది. శనివారం హౌస్ సభ్యులను కలిసిన నాగార్జున కాస్తంత సీరియస్ గా ఉన్నాడు. దాంతో పార్టిసిపెంట్స్ సైతం కొంత కంగారు పడ్డారు. కొందరైతే నాగార్జునను అలా సీరియస్ లుక్ లో చూడలేక పోతున్నామన్నారు. చివరకు కాస్తంత మూడ్ మార్చుకుని నాగ్ మామూలు మనిషి అయ్యే ప్రయత్నం చేశాడు. శనివారం వేదిక మీదకు రావడంతోనే ‘హౌస్ లో అండర్ స్టాండింగ్ కన్నా… మిస్ అండర్ స్టాండింగ్ ఎక్కువైంద’ని నాగార్జున కామెంట్ చేశాడు. ప్రతి ఒక్కరి మనసులోనూ అనేకానేక ప్రశ్నలు ఉన్నాయని గ్రహించిన నాగార్జున వాటిని బయట పెట్టే ఛాన్స్ ఇచ్చాడు.

మొదట రవి, ప్రియ, లహరి మధ్య ఉన్న అడ్డు గోడలను కూల్చి, అనుమానాలను తొలగించే ప్రయత్నం చేశాడు. లహరిని కన్ఫెషన్ రూమ్ లోకి పంపి అక్కడో వీడియోను చూపించారు. ఆ తర్వాత రవి విషయంలో ఆమెకు ఓ క్లారిటీ వచ్చింది. దాంతో తన నిర్ణయం ఎంత తప్పో తెలుసుకుంది. ప్రియకు సారీ చెప్పింది. అలానే మానస్ సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడాన్ని నాగార్జున తప్పు పట్టాడు. ఆడటానికి వచ్చిన వ్యక్తులు అలా ఎస్కేప్ కావడం కరెక్ట్ కాదని హితువు పలికాడు. ప్రియాంక కూ నాగార్జున అదే సలహా ఇచ్చాడు. బి స్ట్రాంగ్ అంటూ ధీమా కలిగించాడు. ప్రతి చిన్న విషయానికి విశ్వ కన్నీళ్ళు పెట్టుకోవడాన్ని నాగార్జున ఖండించాడు. మగాళ్ళు కన్నీళ్ళు పెడితే దాని వెనుక ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉండాలని హితబోధ చేశాడు. ఇక షణ్ముఖ్ నైతే నాగ్ ఓ ఆట ఆడించాడు. పేరుకు జస్వంత్ (జెస్సీ) కెప్టెన్ అయినా… నడిపిస్తోందంతా షణ్ణూ నే అంటూ నాగ్ అన్నాడు. అలానే సిరి విషయంలో కాస్తంత సెన్సిబుల్ గా వ్యవహరించమని చెప్పాడు. షణ్ణు, జెస్సీ ఇద్దరూ కలిసి సిరిని ఏడిపించడం కరెక్ట్ కాదని చెప్పాడు. అలానే నటరాజ్ మాస్టర్ ను కూడా నాగ్ శనివారం సరదాగా ఆటపట్టించాడు. ఆయన దృష్టిలో హౌస్ లో గుంటనక్క ఎవరో చెప్పాలని నాగ్ కోరాడు. అయితే… ఇక్కడ గుంటనక్కతో పాటు ఊసరవెల్లి కూడా ఉందని నాటరాజ్ చెప్పడం విశేషం. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఇద్దరి పేర్లూ రివీల్ చేస్తానని నటరాజ్ మాస్టర్ నాగ్ కు మాట ఇచ్చాడు.

షట్ ద డోర్ ఆన్ ది ఫేస్!
వరెస్ట్ పెర్ఫార్మర్ తరహాలోనే… హౌస్ లో ఏ వ్యక్తి ఉండటం కరెక్ట్ కాదో చెప్పమని నాగార్జున సభ్యులను కోరాడు. అందుకోసం ‘షట్ ద డోర్ ఆన్ ది ఫేస్’ అనే గేమ్ ఆడించాడు. అందులో అత్యధికంగా ఐదు మంది లోబో ముఖం మీద డోర్ వేయడం విశేషం. ఇక వివరాలలోకి వెళితే ప్రియా లోబో ముఖంమీద; లోబో లహరి ముఖంమీద, లహరి రవి ముఖంమీద, రవి ప్రియా ముఖంమీద డోర్ వేశారు. అలానే జస్వంత్ లోబో ముఖంమీద డోర్ వేస్తూ, కెప్టెన్ గా ఉన్న తాను లోబో కారణంగా బిగ్ బాస్ తో మాట పడాల్సి వచ్చిందని చెప్పాడు. సిరి సన్నీ ముఖంమీద డోర్ వేస్తూ తనను అతను మాట్లాడనివ్వడం లేదని తెలిపింది., శ్వేత మాసస్ ముఖంమీద, మానస్ యాని మాస్టర్ ముఖం మీద డోర్ వేశారు. యాని మానస్ ముఖంమీద, ప్రియాంక లోబో ముఖంమీద, విశ్వ లోబో ముఖంమీద డోర్ వేశారు. కాజల్ లోబో, నటరాజ్ కాజల్, షణ్ముఖ్ సన్నీ, సన్నీ సిరి, హమీద కాజల్, శ్రీరామ్ జెస్సీ ముఖాలపై డోర్ ను వేశారు. అయితే లోబో… లహరి ముఖాన డోర్ వేయడానికి చెప్పిన కారణమే కాస్తంత ఆసక్తికరంగా ఉంది. ఆమె డ్రస్సింగ్ స్టయిల్ తనను చాలా డిస్ట్రబ్ చేస్తోందని, అందుకే ఆమె ముఖం మీద డోర్ వేసేశానని లోబో చెప్పాడు.

సేవ్ అయిన ప్రియాంక, శ్రీరామ్
మూడోవారంలో బిగ్ బాస్ ఐదుగురు సభ్యులను నామినేట్ చేశాడు. అందులో శ్రీరామ్, ప్రియ, మానస్, లహరి, ప్రియాంక ఉన్నారు. అయితే… శనివారం నాగార్జున ఈ ఐదుగురిలో ఇద్దరిని సేవ్ చేశాడు. అందులో మొదటగా ప్రియాంక సేవ్ కాగా, ‘వాల్ ఆఫ్ లక్’లో శ్రీరామ్ సేవ్ అయిపోయాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రియా, మానస్, లహరి ముగ్గురి జాతకం ఆదివారం తెలియబోతోంది.

లీక్ అయిన లూజర్ నేమ్!
బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రారంభానికి ముందు… ఈసారి లీక్స్ లేకుండా జాగ్రత్త పడతామంటూ నిర్వాహకులు ప్రకటించారు. కానీ బిగ్ బాస్ షో మీద అందరూ దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ షోకు సంబంధించి తాజా సమాచారం ఏది తెలిసినా… దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొందరు విశేషమైన ప్రచారం పొందుతున్నారు. ఆ రకంగా ఆదివారం బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అవుతోంది లహరి అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె పేరుతో మీమ్స్ చేసి శనివారం రాత్రి నుండే ప్రచారం మొదలెట్టేశారు. ఇప్పుడిప్పుడే హౌస్ లో ఎవరు ఏమిటో లహరి తెలుసుకుంటోంది. ఆ సమయంలో ఆమె ఎలిమినేట్ కావడం అనేది కాస్తంత బాధాకరమే. పైగా బిగ్ బాస్ షోలో ఇద్దరు ముగ్గురితో లహరి నాలుగైదు రోజుల క్రితమే లవ్ ట్రాక్ నడపడం మొదలు పెట్టింది. అంతలోనే ఇలా జరగడం వల్ల కొందరి మనసులు బ్రద్దలయ్యే ఆస్కారం లేకపోలేదు. లహరి ఎలిమినేషన్ అనేది నిజమైతే… వరుసగా మూడో వారం కూడా లేడీ కంటెస్టెంటే ఎలిమినేట్ అయిందనుకోవాలి. ఇప్పటికే సరయు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా, ఇప్పుడు లహరి వంతు వచ్చిందని భావించాలి.