NTV Telugu Site icon

Bigg Boss Sivaji: బీపీనా.. బొక్కా.. నన్ను రెచ్చగొట్టకు బిగ్ బాస్.. నీకన్నా పెద్దవాళ్లనే డీల్ చేశా

Sivaji

Sivaji

Bigg Boss Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ప్రారంభించిన శివాజీ ఆ తరువాత హీరోగా కొన్ని మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక సినిమాలకు గ్యాప్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. ముందు టీడీపీ కి సపోర్ట్ చేసి.. ఏదైనా పదవి దక్కించుకోవాలని చూశాడు. కానీ, అది అవ్వకపోయేసరికి.. రాజకీయాల్లో ఉన్న కొంతమందిపై తనదైన శైలిలో మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలు ఇస్తూ .. ఇంకా నేను ఉన్నాను అని అప్పుడప్పుడు గుర్తుచేస్తూ ఉంటాడు. ఇక ఎవరు ఊహించని రీతిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళాడు. శివాజీని చూడగానే చాలామందికి బిగ్ బాస్ పై ఆసక్తి కలిగింది. కాంట్రవర్సీ కింగ్ గా బయట పేరు తెచ్చుకున్న శివాజీ.. బిగ్ బాస్ లో కూడా మంచి కంటెంట్ ఇవ్వగలడు అని అభిమానులు నమ్మారు. నమ్మినట్టే మనోడి విశ్వరూపం మూడో రోజునే బయటపెట్టాడు బిగ్ బాస్. కాఫీ కోసం జరిగిన గొడవలో బిగ్ బాస్ పై ఫైర్ అయ్యాడు శివాజీ. ఇదంతా బిగ్ బాస్ అన్ సీన్ లో ఉండడంతో ఎక్కువ బయటకు రాలేదని తెలుస్తోంది.

Jawan: రేపు రిలీజ్ పెట్టుకొని బాయ్ కాట్ ఏంటిరా.. ?

శివాజీకి మొదటి నుంచి కాఫీ తాగడం అలవాటు అంట. నాలుగు రోజుల నుంచి కాఫీ ఇవ్వమని బిగ్ బాస్ ను అడుగుతున్నా.. ఆయన పట్టించుకోవడం లేదని శివాజీ వాదన. ఇక బిగ్ బాస్ .. ఇంట్లో డాక్టర్ అయిన గౌతమ్ కృష్ణ ఉండడంతో.. బీపీ మెషిన్ తీసుకొని.. శివాజీకి బీపీ చెక్ చేయమని చెప్పాడు. దీంతో చిర్రెత్తుకొచ్చింది శివాజీ.. ” నాకు బీపీ చెక్ చేయాల్సిన అవసరం లేదు.. నాకు నువ్వు కాఫీ ఇస్తే తాగుతా.. బీపీ లేదు.. బొక్క లేదు.. అవసరం లేదు.. కాఫీ కోసం ఇలా చేయటం అన్యాయంగా లేదు.. రెచ్చగొట్టడం కాదా.. ఇది. నాకుఅప్పుడు అర్ధంకాలేదు .. ఇంతకు ముందు షోల్లో వాళ్లేందుకు ఇలా చేస్తున్నారు అని .. ఇప్పుడు తెలుస్తోంది.. నాలుగు రోజుల నుంచి కాఫీ ఇవ్వకుండా చేస్తున్నారు.. నన్ను బిగ్ బాస్ టేస్ట్ చేస్తున్నాడు.. నా ఇజ్జత్ తీద్దామని చూస్తున్నాడు. నేను చాలామందిని చూసినా.. నేను పెద్ద పెద్ద వాళ్లను చూసిన .. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరనుంచి వచ్చినా.. నేను జనం కోసం పనిచేసినవాడిని.. ఉంటే ఉండు అని చెప్తాం .. లేకపోతే పీకినం అని చెప్తాం.. ఇవన్నీ మనతోని కావు. నేను పోతా ఇక్కడనుంచి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments