NTV Telugu Site icon

Bigg Boss NayaniPavani : ప్రిన్స్ యావర్ తో లవ్…క్లారిటి ఇచ్చిన పావని..

Yavar'

Yavar'

బిగ్ బాస్ 7 తెలుగులో టాప్ 6 లో ఉన్న కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. హౌస్ లో ఉన్నంతవరకు యాంగ్రీ బర్డ్ లాగా ఎగిరి పడిన యావర్ తనలోని రొమాంటిక్ యాంగిల్ ను పరిచయం చేశాడు.. కంటెస్టెంట్ నయని పావని ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. రాత్రి వేళ మేడ మీద ఆమె వెనకాలే తిరుగుతున్న వీడియో ఒకటి గతంలో వైరల్ అయ్యింది … ఇక తాజాగా ఈ విషయం పై నయని పావని క్లారిటి ఇచ్చింది..

ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టిన యావర్… స్పై బ్యాచ్ లో ఒకడిగా ఫైనల్ కి వెళ్ళాడు. శివాజీకి పల్లవి ప్రశాంత్, యావర్ శిష్యులుగా వ్యవహరించారు.. ఒక బ్యాచ్ ఉంటూనే తన క్రేజ్ ను పెంచుకున్నాడు.. 15 వారాలు హౌస్ లో రాణించాడు.. హౌస్లో యావర్ ఒకరిద్దరు అమ్మాయిలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా రతిక రోజ్ మాయలో పడ్డాడు. ఆమెను లైన్లో పెట్టే లోపు ఎలిమినేట్ అయ్యింది. దాంతో వ్యవహారం చెడింది. రతిక రీ ఎంట్రీ ఇవ్వడంతో మరలా స్టార్ట్ చేశాడు. ఆమెను ఎవరైనా ఏదైనా అంటే మనోడు దూరెవాడు.. ఆఖరికి ఆమెకు అన్ని చేసే పెట్టేవాడు..

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని కేవలం ఒక్క వారం రోజులు మాత్రమే ఉంది. ఆమెతో యావర్ కి పెద్దగా సాన్నిహిత్యం లేదు. బయటకు వచ్చాక చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. నయని పావని శివాజీకి సపోర్ట్ చేసింది. ఆయనకు ఓటు వేయాలని కోరుకుంది.. దాంతో యావర్ ఆమె పై ఇష్టాన్ని పెంచుకున్నాడు.. నయని పావనితో యావర్ రొమాన్స్ చేశాడు.. అయితే వీరిద్దరి రిలేషన్ గురించి ఒక క్లారిటీ వచ్చింది.. తాజాగా నయని పావని ఫ్యాన్స్ తో ఆన్లైన్ ఛాట్ చేసింది. ఓ నెటిజెన్… మీరు ప్రిన్స్ యావర్ ని ప్రేమిస్తున్నారా? అని అడిగాడు. అరే ఏంట్రా మీరు… ఇంకో క్వశ్చన్ లేదా? లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి? అని సమాధానం చెప్పింది. దాంతో పావని-యావర్ కేవలం మిత్రులు మాత్రమే… ప్రేమికులు కాదని స్పష్టత వచ్చింది.. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఏవో సీరియల్స్ లో చేయబోతున్నారని తెలుస్తుంది..