బిగ్ బాస్ అనే షో ఎక్కడ, ఏ లాంగ్వేజ్ లో చేసినా కూడా సూపర్ హిట్.అయితే గత సీజన్ సూపర్ హిట్ గా నిలవడంతో ఈ సీజన్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.అంతే కాదు ప్రతి సీజన్ కి ముందే ఆ షో కి వెళ్లే కంటెస్టెంట్స్ డీటెయిల్స్ బయటికి వచ్చేవి.ఈ సారి మాత్రం ఆ పేర్లు కూడా బయటికి రాకుండా బిగ్ బాస్ టీమ్ తీసుకున్న జాగ్రత్తలు చాలావరకు ఫలించాయి.దాంతో ఈ షో సీజన్ 8 కి ఫుల్ హైప్ వచ్చింది.ఈ నెల 1 వ తేదీన బిగ్ బాస్ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది.ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున తన స్టైల్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోపలికి పంపారు.అయితే ఈ లాంచ్ ఎంత గ్రాండ్ గా జరిగిందో ఆ ఎపిసోడ్ కి రేటింగ్ కూడా అలానే వచ్చింది.గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డ్ బ్రేకింగ్ గా 18.9 పాయింట్స్ సాధించి దుమ్మురేపింది.
అయితే బిగ్ బాస్ సీజన్ ఎంత క్లిక్ అయ్యింది అనేది తెలియడానికి మూడు నుండి నాలుగు వారాలు టైం పడుతుంది.ప్రస్తుతానికి ఇంకా కంటెస్టెంట్స్ ని, వాళ్ళ గేమ్ ని ప్రేక్షకులు ఓన్ చేసుకునే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఈ సీజన్ సక్సెస్ ప్రిడిక్షన్ ఇప్పుడే చెప్పడం కష్టం.అయితే ఈసారి ఎక్కువమంది సీరియల్ ఆర్టిస్టులను లోపలికి పంపించడం,వండుకు తినే రేషన్ నుండి ప్రైజ్ మనీ వరకు అన్నీ సంపాందించుకోవాలని చెప్పడంలాంటివి చూస్తుంటే ఈ సీజన్ కి వ్యూయర్ షిప్ బాగానే ఉండే అవకాశాలున్నాయి.ఇక టాస్కులు, ట్విస్టులు కూడా ఇప్పుడే మొదలవుతున్నాయి. అంతే కాదు ప్రస్తుతం ఇంట్లో కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు.వైల్డ్ కార్డు ద్వారా ఇంకా కనీసం 5 మంది లోపలికి వెళ్లే అవకాశం ఉంది.వాళ్ళు ఎవరు?,ఎలా ఆడతారు అనే విషయం పై కూడా ఈ సీజన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.మొత్తానికి ఫస్ట్ డే మాత్రం టాప్ రేటింగ్స్ తో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ – 8.