NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: గరం గరంగా నామినేషన్స్.. అమర్ వల్ల ఏడ్చేసిన రైతు బిడ్డ..

Bb13

Bb13

బిగ్ బాస్ 7 సీజన్ లో పదమూడోవారం నామినేషన్స్ గరంగరంగా నామినేషన్స్ మొదలయ్యాయి.. గతవారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో హౌస్ నుంచి అశ్విని, రతికా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నారు.. ఈరోజు నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి.. ఈసారి హౌస్‌లో చాలా మంది శివాజీని టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో ఒకొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలనీ చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అంతా ఈసారి శివాజీని టార్గెట్ చేసి నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. సరైన రీజన్ చెప్పి పేయింట్ ను ముఖానికి పూయాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ముందుగా ప్రియాంక శివాజీ పేరు చెప్పింది .

ఆతర్వాత అర్జున్ కూడా శివాజీ పేరు చెప్పి ఆయన ముఖానికి రంగు పూశాడు. అలాగే గౌతమ్ కూడా శివాజీని నామినేట్ చేసి మీతో నాకు కొన్ని ప్రొబ్లెమ్స్ ఉన్నాయ్ అన్న అని చెప్పాడు.. ఇలా సీరియల్ బ్యాచ్ మొత్తం శివాజీని నామినేట్ చేసి షాక్ ఇచ్చారు.. ఇక తాజాగా ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు.. ఈ ప్రోమోలో ముందుగా శోభా శెట్టి యావర్ ను నామినేట్ చేసింది. తన గురించి తప్పుగా రాశాడు అంటూ రీజన్ చెప్పింది. దానికి నువ్వు చూడకుండా ఎలా నామినేట్ చేస్తావ్ అంటూ యావర్ డిఫైన్ చేసుకున్నాడు. ఆతర్వాత అమర్ దీప్ ప్రశాంత్ ను నామినేట్ చేయాలనీ అనుకున్నాడు. ప్రశాంత్ ఏడవడంతో సరే నేను నామినేట్ చేయను లే ఏడవకు అని అన్నాడు..

ఆ తర్వాత ఆతర్వాత శివాజీ గౌతమ్ ను నామినేట్ చేశాడు. దానికి ప్రశాంత్ ను రైతు బిడ్డ అని సపోర్ట్ చేశారు అంటూ నోరు జారాడు గౌతమ్.. దాంతో ప్రశాంత్ లేచి ఎదో చెప్పబోయాడు. దానికి శివాజీ ప్రశాంత్ రైతు బిడ్డ అని .. యావర్ ఇంకోదో అని నేను సపోర్ట్ చేయలేదు అని డిఫైన్ చేసుకున్నాడు. మరి స్పై అని ఎందుకు వచ్చింది అని గౌతమ్ అడిగాడు. ఆతర్వాత అమర్ కూడా గౌతమ్ ను నామినేట్ చేశాడు. తనకు సపోర్ట్ చేస్తానని చేయకపోవడంతో అమర్ గౌతమ్ ను నామినేట్ చేశాడు.. శోభా ప్రశాంత్ ను నామినేట్ చేశారు.. ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది.. దాంతో హౌస్ మొత్తం వాడి వేడిగా సాగింది.. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..