Site icon NTV Telugu

Bigg Boss 7 Telugu: మళ్లీ మారిన ఓటింగ్.. టాప్ లో సీరియల్ బ్యాచ్.. డేంజర్‌ జోన్‌లోకి శివాజీ బ్యాచ్‌..

Bb13

Bb13

బిగ్ బాస్ 7 సీజన్ ఎండింగ్ చేరుకోవడంతో కొత్త టాస్క్ లను బిగ్ బాస్ ఇస్తున్నాడు.. అవి కాస్త కష్టంగా ఉన్నా హౌస్ మెట్స్ పూర్తి చేస్తున్నారు.. డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగవచ్చునని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టు గానే హౌజ్‌లోనూ ఫినాలే టాస్కులు ప్రారంభమయ్యాయి. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ అంబటి అర్జున్‌ ఏకంగా ఫినాలేలోకి దూసుకెళ్లిపోయాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈ వారం ఎలిమినేషన్‌పైనే ఉంది. 14వ వారంలో మొత్తం ఆరుగురు నామినేషన్స్‌లో నిలిచారు. శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్, శోభా శెట్టి నామినేషన్స్‌ జాబితాలో ఉన్నారు….

ఈ వారం ఓటింగ్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.. అందరు స్ట్రాంగే.. వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వస్తారో అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఎప్పటి లాగే 14వ వారంలో కూడా శివాజీ బ్యాచ్‌ దే ఆధిపత్యం కొనసాగుతోంది. కామన్‌ మ్యాన్‌, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి సుమారు 39 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక ఆ తర్వాతి ప్లేస్‌లో శివాజీ ఉన్నాడు. అతనికి 18 శాతం మంది ఓట్లేశారు. సడెన్ గా ఓట్లు కూడా తారుమారు అయ్యాయి.. యావర్ మూడో స్థానంలో ఉన్నాడు.. ఇప్పుడు ఆ ప్లేసులోకి అమర్ వచ్చాడు..

ప్రియాంక, శోభలతో పాటు ప్రిన్స్‌ యావర్‌ కూడా డేంజర్‌ జోన్‌లోకి వచ్చినట్లే. దీనికి తోడు శోభను సేవ్‌ చేసేందుకు ప్రిన్స్‌ యావర్‌ను ఎలిమినేట్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్‌కు సమయముంది. మరి ఇదే ట్రెండ్‌ కొనసాగితే ప్రిన్స్‌ యావర్‌ డేంజర్‌లో పడినట్లే.. గత కొద్ది వారాలుగా శోభాను స్టార్ మా సేవ్ చేస్తూనే వస్తుంది.. మరి ఈ వారం యావర్, శోభాలలో ఎవరిని బయటకు పంపిస్తుందో తెలియాలంటే ఒక్కరోజు వెయిట్ చెయ్యాల్సిందే..

Exit mobile version