NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ పై రెచ్చిపోయిన మాస్టర్.. ఈ వారం నామినేషన్ లో ఉన్నది ఎవరంటే?

Bb 7th

Bb 7th

బిగ్ బాస్ 7 తెలుగు ఏడోవారం నామినేషన్స్ మరింత హీట్ పెంచేసింది.. కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో ఒకరినొకరు తిట్టుకొని వాదించుకున్నారు. మరోవైపు రైతు బిడ్డపై సందీప్ మాస్టర్ ఒంటికాలిపై లేచాడు .. నువ్వా నేనా అని గొడవకు దిగారు.. కాసేపు హౌస్ ను వీరి మాటలతో హీటెక్కించారు.. ఇక ఈ సారి నామినేషన్స్ లో డప్పు బిడ్డ ని వాయించేశారు హౌస్ మేట్స్.. హౌస్ లోని టాప్ కంటెస్టెంట్స్ అందరు భోలే ను టార్గెట్ చేసి నామినేట్ చేశారు.. భోలే ని నామినేట్ చేస్తూ అమర్ దీప్,శోభా,ప్రియాంక, అర్జున్, పూజ గట్టిగానే గొడవ పడ్డారు. భోలే కి మాట్లాడటం రాదు, ఎలా ప్రవర్తించాలో కూడా తెలియడం లేదు. ఒక్కొక్క సారి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన తీరు ఇలాగే గనుక ఉంటే హౌస్ లో ఉండటం కష్టం అని చెప్పారు..

ఇక సోమవారం నామినేషన్స్ జరిగాయి.. వాడి వేడిగా నామినేషన్స్ జరిగాయి.. ఆ లిస్ట్ లో మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు తెలుస్తుంది.ఆ లిస్ట్ లో ఉన్నా వారు ఎవరంటే .. భోలే, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక, తేజా, ప్రశాంత్, శివాజీ, సందీప్, గౌతమ్ లిస్ట్ లో ఉన్నారు. శివాజీ,ప్రశాంత్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే నామినేట్ అయ్యినట్లు తెలుస్తుంది..

ఇకపోతే భోలే తీరు పై హౌస్ మేట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.. దీంతో మొదటి వారమే అతను బయటకు వెళ్తారని చర్చ సోషల్ మీడియా లో మొదలైంది.. బిగ్ బాస్ ఆటకి భోలే సెట్ కాడు. అతనికి ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. బయట ఉన్నట్టు ఇక్కడ కూడా అలాగే ఉంటున్నాడు. బాగా ఆడి తన సత్తా ఏంటో చూపిస్తాడో లేక తట్టాబుట్టా సర్దుకుని బయటికి వస్తాడో ఈ వారం చూడాలి..