Bigg Boss 7 Telugu: రతిక ఫెయిల్ కంటెస్టెంట్ అంటూ టార్గెట్ చేసిన ప్రశాంత్.. కెప్టెన్ అయిన శివాజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ వారం రసవత్తరంగా సాగుతుంది.. శనివారం ఎపిసోడ్ చాలా సరదాగా సాగింది. వీకెండ్ కావడంతో నాగార్జున అదిరిపోయే లుక్ లో ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత ఒక్కొక్కరితో ముచ్చట పెట్టారు. .ఈ వారం అంత హౌస్ లోకి కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ విశేషాలని నాగార్జున అడిగి తెలుసుకున్నారు.. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది.. శివాజీ కొడుకు గురించి మాట్లాడుతూ.. నీ కొడుకు అచ్చం నీలాగే ఉన్నాడు అని చెప్పారు. ఆ క్రమంలో నువ్వు హౌస్ లోకి వచ్చి బాగా సన్నబడ్డావు అని నాగ్ అన్నారు. దీనికి శివాజీ అవును బాబు గారు అని సమాధానం ఇచ్చారు. బాడీ వెయిట్ తగ్గింది కానీ హెడ్ వెయిట్ పెరిగింది అని నాగ్ అనడంతో శివాజీ షాక్ అయ్యాడు..
ఆ తర్వాత కెప్టెన్ ను ఎంపిక చేశారు.. ఈ రేస్ లో అర్జున్, శివాజీ కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్నారు.. వీళ్ళిద్దరిలో కెప్టెన్ ఎవరో తేల్చేందుకు నాగార్జున చిన్న గేమ్ పెట్టారు. కన్ఫెషన్ రూంలో శివాజీ, అర్జున్ పేరుతో రెండు కిరీటాలు ఉంచారు..కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి శివాజీ, అర్జున్ లలో ఎవరు కెప్టెన్ కావాలని కోరుకుంటున్నారో చెప్పాలి. కెప్టెన్ గా ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో వారి కిరీటంనుంచి ఒక వజ్రం తీసేయాలి. నాగార్జున ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. యునానిమస్ గా అందరూ శివాజీ కెప్టెన్ కావాలని కోరుకున్నారు. ఆల్రెడీ అర్జున్ కెప్టెన్ అయ్యాడు..
Also Read
ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉండే శివాజీ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నట్లు వారంతా చెప్పారు..అర్జున్ కెప్టెన్సీ బ్యాడ్జీని శివాజీకి పెట్టారు. మధ్యలో కొన్ని సరదా సంఘటనలు జరిగాయి. నాగార్జున శోభా శెట్టి దగ్గర కాఫీ పెట్టించుకుని వేదికపైకి తెప్పించుకుని తాగారు. జాగ్రత్త సర్ కాఫీ వేడిగా ఉంటుంది అని శోభా అంటే.. నీ అంత హాట్ గా ఉండదు లే అంటూ చిలిపిగా సమాధానం ఇచ్చారు నాగ్.. దాంతో మన శోభా సిగ్గుతో నవ్వేసింది..రతిక గురించి మాట్లాడుతూ ఏంటి రతిక.. శివ నీకు రోజ్ ఇచ్చాడు అని ప్రశ్నించాడు. ఇక ప్రియాంక అవును సర్ వాడు ఇచ్చారు ఈమె తీసుకుంది అని సరదాగా తెలిపింది. రతికా సమాధానం ఇస్తూ అన్నయ్య ఇస్తున్నట్లు భావించాను సర్ అని చెప్పింది.. నాగార్జున స్పందిస్తూ అమ్మా నువ్వు ఎప్పుడు ఎవరిని అన్నయ అంటావో తెలియదు అని నాగ్ సెటైర్ వేసాడు.. దానికి ప్రశాంత్ నవ్వేశాడు.. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!