NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ కు, అశ్వినికి ఇచ్చిపడేసిన నాగ్.. ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?

Bb Aswini

Bb Aswini

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు చేరుకుంది.. 11 వారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని జనాలు ఆసక్తిగా చూస్తున్నారు.. హౌస్ లో లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లు కూడా అయిపోయాయి.. అందరు గట్టిగానే పోటి పడ్డారు.. మరి ఈ వారం కెప్టెన్ ఎవరు అన్నది మాత్రం ఇంతవరకు చెప్పలేదు. అమర్ కెప్టెన్ అవ్వడం కోసం శివాజీని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. శనివారం వచ్చిందంటే చాలు కింగ్ నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ కు నవ్వుతూనే క్లాస్ తీసుకుంటారన్న విషయం తెలిసిందే..

తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు.. ప్రశాంత్ మర్డర్ అయ్యావు.. దెయ్యం అయ్యావు.. ఆ బూతులు ఏడుకు మాట్లాడావ్ అని అడిగారు నాగ్. దానికి ప్రశాంత్ బిత్తరపోయి సైలెంట్ గా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. దానికి నాగార్జున నవ్వుతూనే మాట్లాడు ప్రశాంత్ .. నామినేషన్స్ లో మాట్లాడుతావ్ గా అంటూ ప్రశాంత్ ను ఇమిటేట్ చేశారు. దాంతో ఎదో తెలియక మాట్లాడును అని ప్రశాంత్ సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. కానీ నాగ్ మాత్రం బూతులు ఎవ్వరూ కావాలని మాట్లాడారు ప్రశాంత్ అంటూ ఫైర్ అయ్యాడు.. అలా ఒక్కొక్కరికి గట్టిగానే క్లాస్ పీకాడు నాగ్..

చివరగా అశ్విని, గౌతమ్ లను లేపాడు నాగార్జున. అశ్విని గురించి మాట్లాడుతూ.. ఈ వారం సింగిల్ ఎలిమినేషనా..? డబుల్ ఎలిమినేషనా..? అని ప్రశ్నించాడు. తెలిసి కూడా సెల్ఫ్ నామినేషన్ చూసుకున్నావా.? అని ప్రశ్నించాడు నాగార్జున. కానిఫిడెన్సా ..? ఓవర్ కానిఫిడెన్సా.?మనం చేసే పొరపాట్లవల్లే మనం బలైపోతాం అని అన్నారు.. అంటే ఈ వారం అశ్విని బయటకు వెళ్లానుందని తెలుస్తుంది.. ఇక ట్విస్ట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి..