Bigg Boss 7 Telugu: సీరియల్ బ్యాచ్ ను కడిగిపడేసిన నాగ్ .. సందీప్ కు భారీ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఎలిమినేషన్ కు రంగం సిద్ధం చేశారు.. వీకెండ్ అంటేనే హౌజ్‌మేట్స్‌పై హోస్ట్ నాగార్జున వేసే పంచులు, కౌంటర్లే గుర్తొస్తాయి. అయితే ఈవారం మాత్రం అలా జరగడం లేదనిపిస్తోంది.. నాగ్ కాస్త సీరియస్ గా క్లాస్ ఇచ్చాడు.. గట్టిగా ఇవ్వడంతో జనాలు కూడా షాక్ అవుతున్నారు.. ముఖ్యంగా హౌజ్‌లో సీరియల్ బ్యాచ్ గా పేరొందిన అమర్ దీప్ చౌదరి, శోభాశెట్టిలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు నాగార్జున.
అలాగే సంచాలక్ సందీప్‌ను కూడా ఓ ఆటాడేసుకున్నారు. నాగ్ అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన కంటెస్టెంట్లు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ముందుగా అమర్‌దీప్‌తో మొదలెట్టాడు నాగ్.. అదే విధంగా ప్రియాంక, అమర్ పై నాగ్ సీరియస్ అయ్యాడు.. అసలు నువ్వు నీకోసం గేమ్ ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా?’ అంటూ అమర్‌దీప్‌కు ఇచ్చిపడేశారు నాగ్. దీనికి మాధానిమిస్తూ ‘నేను నాకోసమే గేమ్ ఆడుతున్నాను’ అని అమర్ చెప్పాడు. అదే సమయంలో ప్రశాంత్ పల్లవి టాపిక్‌ను మధ్యలోకి తీసుకొచ్చారు.. అతన్ని కూడా నాగ్ గట్టిగానే అడిగాడు.. అనంతరం శోభాశెట్టిపై కూడా ఓ రేంజులో ఫైర్ అయ్యారు నాగార్జున.
Also Read
వీకెస్ట్ కంటెస్టెంట్స్‌ని ఎలిమినేట్ చేయమన్నావ్? మరి.. ప్రిన్స్ యావర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి సైడ్ చేశావ్.. అంటే నువ్వు వీక్ కంటెస్టెంట్ అని అంగీకరించినట్టేనా?’ అని నాగ్ అడగ్గా శోభ నీళ్లు నమిలింది. ఇక హౌజ్‌లో సంచాలక్‌గా సందీప్ పూర్తిగా ఫెయిలయ్యాడని నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గేమ్ మధ్యలో నువ్వు అస్సలు ఇన్వాల్వ్ కాకూడదు. మరి నువ్వు ఎందుకు కంటెస్టెంట్స్‌కు పాయింట్స్ ఇస్తున్నావ్’ అని నాగ్ ప్రశ్నకు సందీప్ తెల్లమొహం వేశాడు. సంచాలక్‌గా సందీప్‌పై హౌజ్‌మేట్స్ ఓపినియన్స్ను తీసుకుని అతని బ్యాటరీ లెవెల్ గ్రీన్ నుంచి ఎల్లోకు తగ్గించాడు.. ఇక వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!