బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు చేరుకుంది.. ఇక హౌజ్‌లోనూ ఫినాలే టాస్కులు హోరా హోరీగా సాగుతున్నాయి. టఫ్ టాస్క్లను ఇస్తున్నాడు బిగ్ బాస్.. డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగవచ్చునని తెలుస్తోంది. హౌజ్‌లో అందరి కంటే ముందు అంబటి అర్జున్ ఫినాలేకు చేరుకున్నాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది? అసలు ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందా? లేదా? అన్నది మరో ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే గతంలో టాప్-7 కంటెస్టెంట్స్‌తోనే గ్రాండ్ ఫినాలే నిర్వహించవచ్చని వచ్చాయి.
మరోవైపు గతంలో లాగే టాప్-5 ఇంటి సభ్యులతోనే గ్రాండ్ ఫినాలే కండక్ట్ చేయాలంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగాలి.. ఇక ఈ వారం అర్జున్ తప్ప మిగిలిన అందరు నామినేషన్స్ లో ఉన్నారు.. శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు. అంబటి అర్జున్ ఎలాగో ఇప్పటికే ఫినాలేలోకి వెళ్లిపోయాడు కాబట్టి ఎలిమినేషన్ ఉండదు.. ఈ వారం ఎవరైతే తక్కువ ఓట్లతో ఉంటారు వాళ్లు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్ళాల్సిందే…
ఇదిలా ఉండగా.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతనికి వస్తోన్న ఓటింగ్‌ను చూస్తుంటే ఈ సీజన్‌కు రైతు బిడ్డనే టైటిల్ విన్నర్‌గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రెండు, మూడు స్థానాల్లో శివాజీ, ప్రిన్స్ యావర్ కొనసాగుతున్నారు. ఇక సీరియల్ బ్యాచ్‌కు ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రేసులో ఉన్నాడనుకుంటోన్న అమర్ దీప్ కు తక్కువ ఓట్లు పడుతున్నాయి.. అలాగే చివరి రెండు స్థానాల్లో ప్రియాంక, శోభా ఉన్నారు.. వీరిద్దరిలో ఎవరొకరు హౌస్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.. మరి శోభా ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..