NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: గుడ్డు టాస్క్‌లో భళా అనిపించినా జిలేబి పురం బ్యాచ్..

Bb Batch

Bb Batch

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టమే.. మొన్నటివరకు నువ్వా నేనా అంటూ కాలు రూవ్విన బ్యాచ్ కాస్త నిన్న పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.. అంతా కలిసిపోయి నవ్వులు పూయించారు.. గులాబీ పురం, జిలేబి పురం అంటూ రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ ను డివైడ్ చేసి ఓ స్కిట్ చేయించాడు బిగ్ బాస్. గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ ఒకటి క్రాష్ దాన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఏ టీమ్ ఎక్కువగా సాయం చేస్తే వాళ్లు విన్నర్ అవుతారని వారిలో ఒకరు కెప్టెన్ అవుతారని తెలిపారు బిగ్ బాస్. దాంతో ముందుగా రెండు టీమ్స్ గ్రహాంతర వాసులను సంతోష పెట్టాలని ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్..

ఆ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు హౌస్ మేట్స్.. అటు జిలేబీ పురంలో సర్పంచ్ గా ప్రియాంక. జోతిష్కుడిగా భోలే , అశ్విని.. పల్లెటూరి అమ్మాయిగా అశ్విని. ఇక రెండు ఊర్లు పెద్ద మనిషిగా శివాజీ నటించారు. ఈ టాస్క్ చాలా ఫన్నీగా సాగింది. గులాబీ పురం బ్యాచ్ కంటే జిలేబీ పురం బ్యాచ్ బాగానే నవ్వించారు. ఆతర్వాత మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఈ టాస్క్ అసలు ట్విస్ట్ అనే చెప్పాలి..

ఆ టాస్క్ లో భాగంగా ఒక రౌండ్ బోర్డు మీద ఒక్కొక్క గుడ్డును పట్టికెళ్లి యాక్టివిటీ రూమ్ లో ఉన్న పక్షి గూడు లో పెట్టాలి.అయితే ఆ గుడ్డు ఎక్కడ కిందపడకూడదు. గుడ్డును పట్టుకెళ్లే సమయంలో మధ్యలో తాళ్లు, టైర్లు, మెట్లు ఏర్పాటు చేశారు. ఒకొక్క టీమ్ నుంచి నలుగురు మాత్రమే ఆడాలి.. కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్న మరో వ్యక్తికి ఆ బోర్డు ఇవ్వాలి. అలా ఎవరు ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేస్తే వాళ్లే విన్నర్. గులాబీపురం టీమ్ తరఫున అమర్, గౌతమ్, యావర్, శోభా. జిలేబీపురం తరఫున అశ్విని, అర్జున్, సందీప్, ప్రశాంత్ ఈ గేమ్ ఆడారు.. అలా మొత్తానికి జిలేబి పురం బ్యాచ్ భళా అనిపించారు.. ఈరోజు టాస్క్ లు మాములుగా లేవని తెలుస్తుంది.. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి..