Site icon NTV Telugu

Bigg Boss 7 Telugu: బూతులతో రెచ్చిపోయిన గౌతమ్.. రతికాకు దండం పెట్టేసిన ప్రశాంత్..

Bb7rathika

Bb7rathika

బిగ్ బాస్ హౌస్ లో నాలుగోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది..గౌతమ్, ప్రిన్స్ యావర్ మధ్య వాదన కొనసాగింది. ముందుగా గౌతమ్ యావర్ బిహేవియర్ నచ్చట్లేదని, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదని గౌతమ్ నామినేట్ చేసినట్లు తెలిపారు.. అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదంటూ అరిచాడు గౌతమ్. అంతకు ముందు శివాజీ మాట్లాడుతూ ఇవే మాటలు నాగ్ సర్ ముందు ఎందుకు అడగలేదు.. అంటూ శివాజీ గట్టిగానే క్వశ్చన్ చేశాడు. నాది కోపం కాదు.. ఆకలి అని చెప్పాడు..

నాగ్ సర్ కూడా చెప్పారు.. నాకు ఇప్పుడు గుండె ఆగిపోతే… ఇబ్బంది పడితే నేను డాక్టర్ దగ్గరకు వెళ్తానా లేదా తర్వాత వెళ్తాను కదా.. నేను ఏదైనా తప్పు చేస్తే నువ్వు పోయిన వారం నామినేట్ చేయాల్సింది అంటూ యావర్ తన సైడ్ వాదన వినిపించాడు.. కాసేపు వీరిద్దరి వాదన హౌస్ లో రసవత్తంరంగా మారింది.. గౌతమ్, యావర్ వాదన జరుగుతుండగా.. శోభా ముందు నువ్వు చేసిందేంటీ గౌతమ్ అంటూ ప్రశ్నించాడు శివాజీ. ఒక ఆడపిల్ల ముందు షర్ట్ తీసేసావ్ కదా.. అదేంటని అడగ్గా.. మీరు లాయర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒకసైడే మాట్లాడుతున్నారు అంటూ వాదించారు.. ఇక కాసేపు బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది..

ఇక గౌతమ్ బూతులతో రెచ్చిపోయాడు.. శివాజితో గొడవకు దిగాడు.. ఇక రతిక పొట్టి బట్టలు వేసుకుంటే నాకు నచ్చలేదు చెప్పినా అని ప్రశాంత్ చెప్పగా.. నేను ఎట్లా వేసుకుంటే నీకెందుకు అంటూ గొడవకు దిగింది రతిక. సారీ చెప్పితే నేను మాట్లాడినా.. మళ్లీ ఏయ్ అంటూ మాట్లాడతాడు అంటూ నేనెంటీ అని రతిక సందీప్ తో అనగా.. ఇక రతిక అనను.. అక్కా అంటా అంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్..అమర్ దీప్, ప్రశాంత్, తేజ ముగ్గురిలో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని జ్యూరీ సభ్యులను ఆదేశించాడు బిగ్ బాస్. ఈ ముగ్గురిలో అమర్ దీప్ ను నామినేట్ చేయాలని సందీప్, శివాజీ చెప్పగా.. నాకు నచ్చలేదంటూ చెప్పుకొచ్చింది శోభా చివరకు తేజను నామినేట్ చేశారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..

Exit mobile version