NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ వెరైటీ టాస్క్..కోపంతో రగిలిపోయిన శివాజీ.. షాక్ లో కంటెస్టెంట్స్..

Bbsivaji

Bbsivaji

బిగ్ బాస్ 7 లో కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతుంది.. బిగ్ బాస్ ఇస్తున్న చిత్రవిచిత్ర టాస్క్లు హౌస్ లో ఉన్న వారిని ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇప్పటికే హౌస్ లో ఉన్న వారిని జంటలుగా మార్చాడు బిగ్ బాస్.. ఇందులో అమర్ దీప్-సందీప్‌, శోభా శెట్టి- ప్రియాంకా జంటలుగా ఉన్నారు. వీరిలో తక్కువ స్టార్స్ సాధించిన శోభా శెట్టి- ప్రియాంకాలను కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించాడు బిగ్ బాస్.. ఇక మిగిలిన నాలుగు జంటల మధ్య బిగ్ బాస్ ఒక టాస్క్ ను ఇచ్చాడు.. వారికి తమ ఇంటి దగ్గర నుంచి లెటర్స్ వచ్చాయని అయితే ఆ లెటర్స్ చదవకుండా త్యాగం చేయాలనీ బిగ్ బాస్ చెబుతాడు..

జంటలో ఉన్న ఒకరు మాత్రమే లెటర్ చదవాలి. మిగిలిన వారు తమ లెటరు చదవకూడదు. అలాగే చేసిన వారు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటారు అంటూ ఎదో వెరైటీ రూల్ పెట్టాడు. దాంతో శివాజీకి ఎక్కడో మండింది. మైక్ తీసి పక్కన పెట్టేసి నేను ఈ గేమ్ ఆడను అంటూ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు. శివాజీ గేమ్ ఆడాను అంటూ కోపంగా ఉండటంతో హౌస్ లో ఉన్నవారంతా అవాక్ అయ్యారు. దాంతో శివాజీ తన శిష్యుడు ప్రశాంత్ ను ఎంకరేజ్ చేశాడు..

నువ్వు ఆడు ప్రశాంత్ అంటూ శివాజీ అతడిని ఎంకరేజ్ చేస్తాడు.. అంతేకాదు అక్కడ లెటరూ లేకపోవడం ఏంటి? కెప్టెన్సీ లేకపోవడం ఏంటీ.. అని సర్లే ఏదైనా పర్లేదు. నువ్వు వెళ్లు బిడ్డా.. ఆడు.. మనస్పూర్తిగా చెప్తున్నా. నిన్నే కెప్టెన్‌ని చేద్దాం అనుకున్నా.. అంటూ తాను కోపంతో ఊగిపోయాడు శివాజీ.. ఇక అతన్ని చూసి అందరు షాక్ లో ఉండిపోయారు. శివాజీ మొదటి నుంచి బిగ్ బాస్ పై అసంతృప్తితోనే ఉన్నాడు. కాఫీ కావాలని శివాజీ ఎన్ని సార్లు అడిగినా కూడా బిగ్ బాస్ పట్టించుకోలేదు. ఆతర్వాత చాలా సార్లు నేను ఉండను వెళ్ళిపోతాను.. నావల్ల కాదు అంటూ ఎన్నో సార్లు అన్నాడు.. ఇక ఈరోజు ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది.. మరి కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి..